సినిమా ఇండస్ట్రీలో హిట్ పెయిర్ అనే మాట బాగా వినిపిస్తుంది. హిట్ పెయిర్ అంటే ఆ జంట చేసిన సినిమాలు వరుసగా హిట్ అవ్వడమే. రీసెంట్ గా విజయ్ దేవరకొండ రష్మిక ల జంట నిలిచింది. అయితే ఈ హిట్ పెయిర్స్ కి కొన్ని తిప్పలు కూడా తప్పవు వరుస సినిమాలు కలిసి చేస్తే ఇద్దరి మధ్య ఏదో ఉందనే గుసగుసలు మొదలవుతాయి. అయితే ఇండస్ట్రీలో హిట్ పెయిర్స్ కొత్తగా వచ్చిందేమీ కాదు. ఇది ఎప్పటి నుండో ఇండస్ట్రీలో కనిపిస్తుంటుంది.
Advertisement
అప్పట్లో హీరో సురేష్ నదియాల జంటను హిట్ పెయిర్ అనేవాళ్లు. వీరిద్దరూ కలిసి నటించిన తమిళ సినిమా మొదట సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరవాత వీరిద్దరూ వరుస సినిమాలు చేశారు. ఈ పెయిర్ కు హిట్ పెయిర్ అనే టాగ్ పడింది. ఇక ఇద్దరూ అలా వరుస సినిమాలు చేస్తుండటంతో ఒకానొక సమయంలో ఏకంగా సురేష్ నదియా పెళ్లి అంటూ వార్తలు మొదలయ్యాయి. ప్రముఖ వార్తా పత్రికల్లో సురేష్ నదియాల పెళ్లి అంటూ వార్తలు గుప్పుమన్నాయి.
Advertisement
ఆ వార్తలు అటు నదియాకు ఇటు సురేష్ కు తలనొప్పిగా మారాయి. దాంతో ఓ ఇంటర్య్వూలో సురేష్ ఈ వార్తలపై స్పందించాడు. నదియాతో పెళ్లి అనే వార్తలను ఖండించాడు. అంతే కాకుండా ఆ తరవాత నదియాతో కలిసి నటించే ఆఫర్ లు వచ్చినా రిజెక్ట్ చేశాడు. ఒకసారి చేసిన హీరోయిన్ మళ్లీ కలిసి సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాడు.
ఆ తరవాత నదియా అమెరికాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. దాంతో పుకార్లకు పూర్తిగా చెక్ పడింది. ఇక నదియా రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది సినిమా తరవాత నదియా ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది.
ALSO READ :
పెళ్లి పీటలు ఎక్కబోతున్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్….వరుడు ఎవరంటే…!