నల్గొండలోని ఎంజి యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలో, నాగర్ కర్నూలు జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్లకు చెందిన నేనావత్ నవీన్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న హరితో నవీన్ కు స్నేహం ఉంది. వీరిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. కొద్దిరోజులుగా బేధాభిప్రాయాలు వచ్చాయి. నవీన్ వల్ల తనకు అమ్మాయి దక్కదేమోనని హరి భావించాడు. అప్పుడు మాస్టర్ ప్లాన్ వేశాడు. హరి ఈ నెల 17న ఉదయం పార్టీ చేసుకుందామని నవీన్ ను హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ లో తన స్నేహితుడి రూమ్ కు రమ్మని చెప్పాడు.
Advertisement
Advertisement
ఇద్దరు పార్టీ చేసుకుంటున్న సమయంలో గొడవ జరిగింది. వెంటనే నవీన్ తండ్రి శంకరయ్యకు ఫోన్ చేసి గొడవ గురించి చెప్పాడు. శంకరయ్య హరితో మాట్లాడటంతో అంతటితో గొడవ ఆగింది. ఇంతలో నవీన్ నాలుగు రోజులుగా కాలేజీకి వెళ్లడం లేదని తండ్రి శంకరయ్యకు తెలిసింది. అప్పుడు నవీన్ తండి శంకరయ్యకు అనుమానం పెరిగింది. ఈ నెల 22న శంకరయ్య నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంజియూలో విద్యార్థులను, హరి స్నేహితులతో మాట్లాడారు. హరి ఫోన్ ఈనెల 22న సాయంత్రం నుంచి స్విచాఫ్ రావడంతో అతడి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించారు.
హరి గురించి ఆరా తీశారు. అతడి గురించి వివరాలు తెలియలేదు. ఇంతలో హరి శుక్రవారం రాత్రి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. అమ్మాయి విషయంలో గొడవతో ఆమె తనకు దక్కదని భావించి నవీన్ కొట్టి హా** చేసినట్లు ఒప్పుకున్నాడు. మృ *** దేహాన్ని నిందితుడు హరి అబ్దుల్లాపూర్మెట్ శివారులోని హైదరాబాద్-విజయవాడ హైవేపై పడేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
READ ALSO : తారకరత్న మృతి చెందిన 2 రోజులకే.. ఆయన భార్య సంచలన నిర్ణయం !