Ad
ఐపీఎల్ 2022 ప్రస్తుతం చాలా రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో కొత్తగా రెండు జట్లు రావడంతో ప్లే ఆఫ్స్ పోటీ బాగా పెరిగింది. అయితే ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ ఒక్కటే ప్లేఆఫ్స్ లో స్థానం దక్కించుకోగా… మిగిలిన మూడు స్థానాల కోసం అధికారికంగా ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు జట్లు నిన్న చాలా కీలకమైన మ్యాచ్లో పోటీ పడ్డాయి. ఎందుకంటే… ఈ మ్యాచ్ లో ఓడిపోతే పంజాబ్ కు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు దూరం అయినట్లే… అలాగే ఒకవేళ బెంగళూరు ఓడిపోతే ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్నట్లు అవుతుంది.
అయితే ఈ మ్యాచ్ లో నిన్న మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ లక్ష్యాన్ని బెంగళూరు ముందు ఉంచింది. ఆ లక్ష్య ఛేదన కోసం వచ్చిన బెంగళూరు ఓడిపోయింది అయితే బెంగళూరు జట్టుకు నల్లపిల్లి శాపం తాగడం వల్లే ఆ జట్టు ఓడిపోయింది అంటున్నారు బెంగళూరు అభిమానులు. మామూలుగా మన ఇండియాలో ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురైతే అపశకునం… ఒకవేళ నల్ల పిల్లి ఎదురైతే వెళ్లే పని జరగదు అని అభిప్రాయపడుతుంటారు
నిన్నటి మ్యాచ్ ఆరంభంలో కూడా సరిగ్గా ఇలానే జరిగింది. లక్ష్య ఛేదన కోసం గ్రౌండ్లోకి బెంగళూరు ఓపెనర్లు వచ్చారు. అయితే అప్పుడే ఆ మ్యాచ్ చూడడానికి ఒక నల్ల పిల్లి వచ్చి సైడ్ స్క్రీన్ మీద కూర్చుని ఉంది. ఇక ఇన్నింగ్స్ ప్రారంభిధం అనుకున్న సమయంలో బెంగళూరు ఓపెనర్, కెప్టెన్ అయిన ఫాప్ డుప్లెసిస్ ఆ నల్ల పిల్లిని చూసి నాకు సైట్ స్క్రీన్ ఇబ్బందిగా ఉంది అని చెప్పాడు. దాంతో అక్కడి నుండి ఆ పిల్లిని అంపైర్ పంపించారు. ఆ తర్వాత బెంగళూరు జట్టు ఓటమిపాలైంది. దాంతో తమ జట్టు ఓడిపోవడానికి నల్లపిల్లి కారణమంటూ బెంగళూరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Advertisement