Home » నటి హేమ 19 ఏళ్లకే అలా చేసిందా..? ఈమె స్టోరీలో అన్నీ ట్విస్ట్ లే..!

నటి హేమ 19 ఏళ్లకే అలా చేసిందా..? ఈమె స్టోరీలో అన్నీ ట్విస్ట్ లే..!

by Anji
Ad

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతలా అలరిస్తుందో బయట కూడా ఏదైనా విషయం జరిగితే అంతే రేంజ్ లో స్పందిస్తూ ఉంటుంది. ఒకానొక సమయంలో విజయవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో మీడియా ప్రతినిధులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఇకపోతే అప్పటినుంచి మీడియాకి దూరంగా ఉంటున్న హేమ తాజాగా చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన లవ్ స్టోరీ, పెళ్లి, ఆ తర్వాత సవాళ్లను ఊహించని ట్విస్ట్ లతో తన ప్రేమ కథ ఎలా సాగింది, ఇలా ఎన్నో విషయాలను వెల్లడించింది.

Advertisement

1989లో వెండితెరకు పరిచయమైన ఈమె 200 సినిమాలలో నటించింది. ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన హేమ తరచుగా మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. ఇక తన భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్ అని, తమకు కూతురు ఉందని వెల్లడించింది. ఇక తన ప్రేమ కథ గురించి చెబుతూ.. నేను దూరదర్శన్ లో పనిచేసినప్పుడు ఆయన పరిచయమయ్యారు. అక్కడే తాను కూడా అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు కలిసిన మొదటి మీటింగ్ లోనే జాన్ పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు. అప్పుడు నా వయసు 18 దాటుతోంది. కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మోసం చేసే వ్యక్తి కాదు అని అనుకున్నాను. ఇక అక్కడ నుంచి ఫోన్లో మాట్లాడడం మొదలు పెట్టాము.

Advertisement

అయితే ఒక రోజు పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. అయితే మాది రిజిస్టర్ మ్యారేజ్. ముస్లిం కావడంతో తలాక్ చెప్పి మరో పెళ్లి చేసుకుంటారనే సందేహం ఉండేది. అందుకే రిజిస్టర్ మ్యారేజ్ కి ఓకే చెప్పాను. పెళ్లయ్యాక కొద్ది రోజులకు ఇంట్లో విషయం తెలిసింది. మా అమ్మ కోప్పడింది. ఇప్పటికే నా కెరియర్ పీక్స్ లో ఉండడం వల్ల నేను మ్యారేజ్ చేసుకోవడంతో ఆందోళనకు గురైంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఇరు కుటుంబాలు కలిసి రిసెప్షన్ ఏర్పాటు చేశాము. ఇంకా ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. అలా మరొకసారి పెళ్లి జరిగింది. నెలకు రూ.4 వేల జీతంతో కుటుంబాన్ని మొదలుపెట్టాము. మాకు పెద్దగా ఆశలు లేవు. ఉన్నదాంట్లోనే సర్దుకుపోయే వాళ్ళము. కెమెరామెన్ గా ఆయన సక్సెస్ కాకపోతే ఏదో ఉద్యోగం చేసి పోషిస్తాడనే ధైర్యంతోనే పెళ్లి చేసుకున్నాను అంటూ ఆమె తెలిపింది. మొత్తానికైతే హేమ ప్రేమ, పెళ్లి గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

Visitors Are Also Reading