Home » టీటీడీ కీలక నిర్ణయం.. మహిళా భక్తులకు మంగళసూత్రాలు..లక్ష్మీకాసులు!

టీటీడీ కీలక నిర్ణయం.. మహిళా భక్తులకు మంగళసూత్రాలు..లక్ష్మీకాసులు!

by Anji
Ad

టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. మొత్తం రూ. 514.74కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. లడ్డు ట్రే మోసే కార్మికుల వేతనాలు రూ. 15వేలు అదనంగా పెంచుతూ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.

Advertisement

Advertisement

తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు సమావేశంలో భక్తుల కోసం కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకున్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాలర్లు తరహాలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మహిళల కోసం మంగళసూత్రాలు, లక్ష్మీకాసులను తయారు చేయించాలని నిర్ణయించారు. లాభాపేక్ష లేకుండా మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు విక్రయిస్తామని తెలిపారు. హైందవస్త్రీలకు ఈ మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు ఒక అమూల్యమైన కానుక అన్నారు. వేదపాఠశాల్లో 51మంది సంభావన అధ్యాపకుల వేతనాలు రూ. 34 వేల నుంచి రూ. 54 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో పనిచేసేందుకు నూతనంగా పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Visitors Are Also Reading