Home » తెలంగాణ పోలీస్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. వాళ్లకు ఈవెంట్స్‌ లేవు.. డైరెక్ట్‌గా మెయిన్సే

తెలంగాణ పోలీస్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. వాళ్లకు ఈవెంట్స్‌ లేవు.. డైరెక్ట్‌గా మెయిన్సే

by Bunty
Ad

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పోలీస్‌ నియామకాల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, ఎంట్రన్స్‌ పరీక్ష పూర్తి కాగా, ఇప్పుడు పోలీస్‌ ఈవెంట్స్‌ జరుగుతున్నాయి. మరో వారం రోజుల్లోనే ఈ పోలీస్‌ ఈవెంట్స్‌ కూడా ముగియనున్నాయి. ఈ తరుణంలో.. పోలీస్‌ నియామకాల మండలి అదిరిపోయే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నడుపుతున్న పోలీస్ నియామకంలో గర్భిణీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

Advertisement

ఫిజికల్ టెస్టుల నుంచి వారికి మినహాయింపునిస్తూ ఆదేశాలు వెల్లడించింది. దేహాదారుఢ్య పరీక్షలో గర్భిణీలకు మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దేహాదారుద్య పరీక్షల్లో పాల్గొనకుండానే తుది అర్హత పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తుది అర్హత పరీక్ష పాసైన నెలలోపు, దేహాదారుఢ్య పరీక్షలో పాల్గొని అందులోనూ అర్హత సాధిస్తేనే వచ్చిన మార్పుల ఆధారంగా ఉద్యోగం లభిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

ఈ మేరకు పోలీసు నియామక బోర్డు అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ మినహాయింపులను ఇచ్చిన ప్రభుత్వం గర్భిణీ అభ్యర్థులకు కొన్ని షరతులు విధించింది. పోలీసు ఉద్యోగ నియామకాలు కోసం నిర్వహిస్తున్న దేహాదారుడ్య పరీక్షల్లో గర్భిణీలకు మినహాయింపు నిస్తున్నట్లు పోలీస్ నియామక మండలి అధికారులు తెలిపారు. దేహాదారుఢ్య పరీక్షల కోసం గర్భిణీ అభ్యర్థులు నిబంధనలను అంగీకరిస్తున్నట్లు లేఖ రాసి ఇవ్వాలని పోలీసు నియామక మండలి అధికారులు స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు గర్భిణీలకు ఈ మినహాయింపు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ పోలీస్‌ ఈవెంట్స్‌ డిసెంబర్‌ 8న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.

READ ALSO : తల్లి అయిన నిత్యామీనన్.. చేతిలో పసిబిడ్డతో ప్రత్యక్షం !

Visitors Are Also Reading