ఐపీఎల్ 2022 సీజన్ లో టైటిల్ కోసం మొత్తం 10 జట్లు పోటీ పడగ.. అందులో ఈ ఏడాదే కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ టైటిల్ ను అందుకుంది. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ పై దారుణమైన ట్రోలింగ్ అనేది జరుగుతుంది. కేకేఆర్ జట్టులో ఎక్కువగా మార్పులు చేయడం వల్ల ఆ జట్టు మధ్యలో వరుస ఓటములు చూసింది. అంధుల సీజన్ ముగిసే సమయానికి 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. కానీ ఇప్పుడు బ్రెండన్ మెక్ కల్లమ్ పై వస్తున్న విమర్శలకు కారణం ఇది కాదు.
Advertisement
అయితే బ్రెండన్ మెక్ కల్లమ్ ఈ ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్ గా బాధ్యతలను అందుకున్నాడు. కానీ ఆ పదవిలో అతై మొదటి మ్యాచ్ తన సొంత జట్టు అయిన న్యూజిలాండ్ కు వ్యతిరేకంగానే కావడం ఇందుకు కారణమైంది. ఇంగ్లాండ్ మనకు 2019 ప్రపంచ కప్ లో చేసిన ద్రోహాన్ని అప్పుడే మరిచిపోయావా అంటూ బ్రెండన్ మెక్ కల్లమ్ ను అభిమానులు టోల్ చేస్తున్నారు. దానికి తోడు బ్రెండన్ మెక్ కల్లమ్ కామెంట్స్ కూడా వాటికీ ఆద్యం పోశాయి.
Advertisement
తాజాగా ఇంగ్లాండ్ జట్టుతో కలిసిన బ్రెండన్ మెక్ కల్లమ్.. మళ్ళీ ఇంగ్లాండ్ టెస్ట్ జట్టును మొదటి స్థానానికి తీసుకవస్తాను అంటూ కామెంట్స్ చేసాడు. అయితే గత ఏడాది టెస్ట్ ఛాంపియన్ గా నిలిచినా న్యూజిలాండ్ జట్టును ఓడిస్తాము అని బ్రెండన్ మెక్ కల్లమ్ చెప్పకనే చెప్పాడు. దాంతో నువ్వు కెప్టెన్ గా వ్యవరించిన జట్టునే నువ్వు ఓడిస్తావా.. అంటే సొంత దేశానికే ద్రోహం చేస్తావా అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే రేపటి నుండే ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. చూడాలి మరి ఇందులో ఎవరు ఎవరిని ఓడిస్తారు అనేది.
ఇవి కూడా చదవండి :