టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. మాటల రచయితగా కెరీర్ ను ప్రారంభించిన త్రివిక్రమ్ ఆ తరవాత నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మారారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు రావడంతో వరుస ఆఫర్లు అందుకున్నారు. టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరితోనూ త్రివిక్రమ్ సినిమాలు చేశారు. అల్లుఅర్జున్,పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ సహా పలువురు స్టార్ లతో సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకున్నారు.
Advertisement
ఇక రీసెంట్ గా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాకు మాటలు అందించడంతో పాటూ స్క్రీన్ ప్లే కూడా ఇచ్చారని సినిమాకు బ్యాక్ బోన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని దర్శకుడు చెబుతున్నాడు. అంతే కాకుండా త్రివిక్రమ్ తన తరువాత సినిమాను మహేశ్ బాబు తో తెరకెక్కించనున్నారు. ఇప్పటికే మహేశ్ బాబుతో అతడు, ఖలేజా లాంటి సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా కూడా చేస్తున్నాడు.
Also read: రూ.250 కోట్ల ఆస్తులు ప్రభుత్వానికి.. గౌతమ్‌రెడ్డి పేరిట అగ్రికల్చర్ యూనివర్సిటీ
Advertisement
అయితే సినిమాల్లో స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన త్రివిక్రమ్ కు ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేదు. తాజాగా ఈ విషయాన్ని త్రివిక్రమ్ తండ్రి భాస్కరరావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతే కాకుండా పలు ఆసక్తికర విషయాలను చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమవరంలో జన్మించి అక్కడే విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. అయితే త్రివిక్రమ్ చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలని ఆయన తండ్రి అనుకునేవారట.
బీఎస్సీలో న్యూక్లియర్ చదివిన తరవాత త్రివిక్రమ్ కు ప్రముఖ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో ఉద్యోగం కూడా వచ్చిందట. కానీ తన తండ్రికి తాను ఉద్యోగం చేయనని సినిమాల్లోకి వెళతానని త్రివిక్రమ్ చెప్పాడట. దానికి తండ్రి కూడా అభిరుచికి తగ్గట్టుగానే వెళ్లమని సూచించారట. ఇక త్రివిక్రమ్ లెక్చరర్ గా పనిచేశారని చెబుతుంటారు. కానీ త్రివిక్రమ్ లెక్చరర్ గా పనిచేయలేదని కాన్వెంట్ లో టీచింగ్ చేశారని ఆయన తండ్రి చెబుతున్నారు. త్రివిక్రమ్ ట్యూషన్లు కూడా చెప్పేవాడని భాస్కరరావు వెల్లడించారు.
Also Read: హీరో నాని భార్య అంజన బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే…!