Home » రైలు ప్రయాణమా.. ఇలా చేస్తే 10లక్షల భరోసా..?

రైలు ప్రయాణమా.. ఇలా చేస్తే 10లక్షల భరోసా..?

by Sravanthi
Ad

మానవ జీవితం చాలా చిన్నది ఈ లైఫ్ లో ఎన్నో అవరోధాలు, అవాంతరాలు. అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తాను ఎప్పుడు పుడతాడో తెలియదు, ఎప్పుడు మరణిస్తాడో తెలియదు. ఇలాంటి ఈ జీవితాన్ని గడిపినన్ని రోజులు ఆనందంగా హ్యాపీగా గడపాలని అంటారు. నిన్నటికి నిన్న ఒడిస్సా లో జరిగిన మూడు రైళ్ల ప్రమాద సంఘటనలో ఎంతోమంది ప్రజలు మరణించారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు..

Advertisement

ఆ ఘటన వ్యవహారం చూస్తే గుండె బరువెక్కి కన్నీరు పెడతారు.. కళావికలమైన శరీరాలు, రక్తాలతో నిండిన దేహాలు ఘటన మామూలుగా లేదు. దాదాపుగా 290కు పైగామృతి చెందినట్లు తెలుస్తోంది.ప్రతిపక్షాలేమో 500 పైగా మృతి చెందారని అంటున్నారు. అంతేకాకుండా వేలాది మందికి గాయాలయ్యాయి.. ఇలా దేశంలో రైలు ప్రమాదాలు ఎప్పుడూ ఏదో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అయినా ప్రయాణికులు ఇది గమనించడం లేదు. మనం రైలు ప్రయాణం చేసే ముందు ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. కానీ దీన్ని టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఎవరూ కూడా చేసుకోవడం లేదు.

Advertisement

అయితే ఈ ఇన్సూరెన్స్ రైల్లో ప్రయాణించే సమయంలో ఐఆర్సిటిసి యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. దానిపై ఎవరూ క్లిక్ చేయడం లేదు. కేవలం 45 పైసలకే ఇన్సూరెన్స్ అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ రైలు ప్రమాదానికి గురై మరణించిన వారి కుటుంబానికి 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ఒకవేళ అంగవైకల్యం కలిగితే రూ.7.5లక్షలు వస్తుంది. గాయాలు అయితే రూ.2లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది.. దీని ద్వారా ఒకవేళ కుటుంబ సభ్యుడు మరణించిన వారి ఇంటికి ఎంతో కొంత భరోసా ఇచ్చినట్టు అవుతుంది.
మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading