కమెడియన్స్ కదా అని తక్కువ అంచనా వేశారో పప్పులో కాలు వేసినట్టే ఎందుకనగా మన దగ్గర కొందరూ కమెడియన్లు హీరోలతో సమానంగా సంపాదిస్తున్నారు. రోజుకు ఇంత అంటూ కాల్సిట్ ప్రకారం.. ముక్కు పిండి హీరోలతో సమానంగా సంపాదిస్తుంటారు. ఏడాది పాటు కలిసి ఒక్కో సినిమాలో హీరో నటిస్తే.. కానీ కమెడియన్స్ మాత్రం ఏడాదంతా నటిస్తూనే ఉంటారు. టాలీవుడ్‌లో కమెడీయన్లు ఎక్కువగానే ఉన్నారు. ఈమధ్య కాలంలోనే కొందరూ సీనియర్లు మరణించారు. లేకుంటే మన దగ్గర ఉన్నంత మంది మరెక్కడా లేరు. ఇప్పుడు ఉన్న కమెడియన్‌లలో ఎవరూ ఎంత పారితోషికం తీసుకుంటారో ఒకసారి చూద్దాం..!
బ్రహ్మానందం
ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమా చూడడం కష్టంగా అనిపించేది. అయితే వయసు రిత్యా అనారోగ్య కారణాలతో ఈయన కొన్నేండ్లుగా సినిమాలకు తనకు తానుగా రెస్ట్ తీసుకున్నాడు. వచ్చిన అన్ని సినిమాలు కాకుండా.. నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ఈయన రెమ్యునరేషన్ రోజుకు దాదాపు 3లక్షలు.
వెన్నెల కిషోర్
ప్రస్తుతం టాలీవుడ్ లీడింగ్ కమెడీయన్ ఈయనే. ఏడాదికి సుమారు 25 సినిమాల వరకు నటిస్తున్నాడు. ఈయన లేని సినిమా అంటూ ఈ మధ్య కనిపించడం లేదు. చిరంజీవి నుంచి చిన్న హీరోల సినిమాల వరకు అందరికీ వెన్నెల కిషోర్ ఫెవరేట్ కమెడియన్. రోజుకు సుమారు 2 నుంచి 3 లక్షల వరకు తీసుకుంటాడట.
అలీ
సీనియర్ కమెడియన్ అలీ ఇప్పుడు సినిమాల కంటే ఎక్కువగా బుల్లితెరపై ఫోకస్ చేస్తున్నాడు. అక్కడే ఆయనకు మంచి ఇన్‌కమ్ కూడా వస్తోంది. అందుకే వచ్చిన సినిమాలు చేసుకుంటూ.. మధ్యలో బుల్లితెరవైపు వెళ్లుతున్నాడు. ఈయన రోజుకు సుమారు రూ.3.5లక్షలు తీసుకుంటున్నాడు.
సునీల్
ఫామ్‌లో ఉన్నా.. లేకపోయినా సునీల్ ఎప్పుడూ టాప్ కమెడీయన్ లిస్ట్‌లో ఉంటాడు. ఈయన హీరోగా సినిమాలు చేసి మళ్లీ కమెడీయన్, విలన్‌గా చేస్తున్నా.. కానీ క్రేజ్ మాత్రం అదేవిధంగా ఉంది. ఇప్పటికీ రోజుకు ఈయన సుమారు 4లక్షల తీసుకుంటున్నాడు అని తెలుస్తోంది.
సప్తగిరి
ఓ వైపు హీరోగా చేసుకుంటూనే మరొకవైపు కమెడీయన్‌గా కంటిన్యూ అవుతున్నాడు. సప్తగిరి ఈయనకు ఓ టిపికల్ స్టైల్. అందుకే కొందరూ దర్శకులు సప్తగిరిని బాగా వాడుకుంటున్నారు. కానీ ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఈ మధ్య ఎందుకో. అయినా ఈయన రోజు పారితోషకం సుమారు రూ.2లక్షలకు పైగా ఉన్నది.
పోసాని కృష్ణమురళి
దర్శకునిగా, రైటర్‌గా ఇండస్ట్రీకి వచ్చిన పోసాని.. ఇప్పుడు నటుడిగా చాలా బిజీ ఆర్టిస్ట్ కొన్నేళ్లుగా ఏడాదికి 30 సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో అదిరిపోయే క్యారెక్టర్లు పడుతున్నాయి. అన్ని రకాల క్యారెక్టర్లు చేసే ఈయన రోజుకు సుమారు 2.5లక్షలు తీసుకుంటున్నాడు.
రాహుల్ రామకృష్ణ
న్యూ ఏజ్ కమెడీయన్‌లలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయనకు కూడా క్రేజ్ బాగానే ఉంది ఇప్పుడు. అందుకే పారితోషకం కూడా బాగానే ఉంది. రోజుకు సుమారు రూ.2లక్షలు తీసుకుంటున్నాడు రాహుల్.
పృథ్వీ
ఒకప్పుడు 30 ఇయర్స్ పృథ్వీ అంటే ఉన్న ఇమేజ్ ఇప్పుడు కనిపించడం లేదు. అందుకే అవకాశాలు కూడా తగ్గిపోయాయి. రోజుకు ఇది వరకు రూ2లక్షల తీసుకున్న ఈయన. ఇప్పుడు రూ.75వేల నుంచి రూ.1లక్షల వరకు మాత్రమే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ప్రియదర్శి
యంగ్ కమెడీయన్‌లలో వర్సటాలిటీ ఉన్న వాడు ప్రియదర్శి పులికొండ. కేవలం కమెడీయన్‌గానే కాకుండా నటుడిగా ఈయన చాలా బీజీ అవుతున్నాడు. వెబ్ సిరీస్‌లు చేసుకుంటూనే మరొకవైపు సినిమాల్లో కమెడీయన్‌గా రాణిస్తున్నాడు. ఈయన పారితోషకం రోజుకు సుమారు రూ.2లక్షలు.
శ్రీనివాస్‌రెడ్డి
20 సంవత్సరాల కిందట ఇండస్ట్రీకి వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి.. రవితేజ ఇడియట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడీయన్‌గానే కాకుండా హీరోగా కూడా నటిస్తున్నాడు. ఈయన పారితోషకం రోజుకు రూ.2లక్షలు ఉంటుందని అంచనా.. ఇలా టాలీవుడ్‌కు చెందిన పలువురు కమెడీయన్లు ఎవరి రేంజ్‌కు తగ్గట్టు వారు రోజువారిగా పారితోషకం తీసుకుంటున్నారు.