Home » ఒత్తిడిలో టాలీవుడ్ స్టార్ దర్శకుడు.. ఆ హీరో సినిమానే కారణమా ? 

ఒత్తిడిలో టాలీవుడ్ స్టార్ దర్శకుడు.. ఆ హీరో సినిమానే కారణమా ? 

by Anji
Ad

టాలీవుడ్ టాలెంటేడ్ దర్శకుడిగా  పేరు పొందిన వెంకి కుడుముల గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన చదువుకునే రోజుల్లో సినిమాలపై ఆకర్షితుడయ్యాడు. అలా తొలుత తేజ దర్శకత్వం వహించిన నీకు నాకు డాష్ డాష్ అనే చిత్రానికి  అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాడు. రామ్ చరణ్ తుఫాన్ సినిమాకు సహ రచయితగా, జాదుగాడు, అఆ వంటి సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశాడు. ముఖ్యంగా ఆయన ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. 

Advertisement

 ఈ దర్శకుడు తాజాగా ఓ షాకింగ్ ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 08న బర్త్ డే జరుపుకున్న స్టార్ హీరో.. ఓ ఫ్యాన్ ట్వీట్ పై అసహనం వ్యక్తం చేశారు. తను నితిన్ తో చేయబోయే తరువాత సినిమా అప్డేట్ అడిగిన ఆ ఫ్యాన్ ను వెంకీ కుడుముల కాస్త కూల్ గానే మందలించాడు. పుట్టిన రోజు ప్లజెంట్ గా అనుకుంటున్నా అని.. అప్డేట్ అంటూ.. ఒత్తిడి చేయవద్దంటూ.. తన ట్వీట్ లో రాసుకొచ్చారు. తప్పకుండా సరైన సమయం చూసుకొని నితిన్ మూవీ  అప్డేట్స్ ఇస్తానని.. తనను అప్డేట్ అడిగిన ఫ్యాన్ కి సమాధానం ఇచ్చారు. 

Advertisement

నితిన్ హీరోగా నటించిన భీష్మ తరువాత మరే సినిమా చేయని వెంకీ కుడుముల మరోసారి నితిన్, రష్మికతోనే VNR Trio వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమాను ప్రకటించారు. కానీ ఈ మూవీ నుంచి రీసెంట్ గా హీరోయిన్ రష్మిక తప్పుకోవడంతో మరో హీరోయిన్ ను ఫిక్స్ చేసే పనిలో  ఉన్నారు. దీంతో పాటు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో చాలా బిజీగా ఉన్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రతిక కి ఆ కారణం వల్లనే రాహుల్ సిప్లిగంజ్ తో బ్రేకప్ అయిందా ?

వన్డేల్లో టాప్ ప్లేయర్లు వీరే.. డ్రీమ్ ODI ప్లేయింగ్ XI లో టాప్ 5 ని ప్రకటించిన సెహ్వాగ్..!

Visitors Are Also Reading