తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరొక తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్న శరత్‌కుమార్ ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచాడు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.
Advertisement
పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రేపు 11 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శరత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చాదస్తపు మొగుడు సినిమాతో దర్శకునిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం డియర్ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. సుమన్, భానుప్రియ హీరోయిన్లుగా తెరకెక్కిన చాదస్తపు మొగుడు సినిమాతో ఇండస్ట్రీకి శరత్ పరిచయమయ్యారు. దాదాపు 20 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. ముఖ్యంగా బాలకృష్ణ, సుమన్ లతో సూపర్ హిట్స్ అందుకున్నారు.
Advertisement
బాలకృష్ణతో వంశానికి ఒక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్దారకుడు వంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు. సుమన్‌తో చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ-బావమరిది, చిన్నల్లుడు వంటి సినిమాలు తెరకెక్కించాడు. శరత్‌కు మాత్రం పెళ్లి కాలేదు. ఆయన మృతితో ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
Also Read : RRR ను మిస్ చేసుకున్న హీరోలు వీరే..!