Home » నెట్లో వైరల్ అవుతున్న మన సెలబ్రెటీల వెడ్డింగ్ కార్డ్స్ చూసారా ?

నెట్లో వైరల్ అవుతున్న మన సెలబ్రెటీల వెడ్డింగ్ కార్డ్స్ చూసారా ?

by AJAY
Ad

పెళ్లికి ముందు బంధువులను స్నేహితులను ఆహ్వానిస్తూ ఇచ్చే పెళ్లి పత్రికలు ఎంతో ప్రత్యేకమైనవి. ప్రతి ఒక్కరు తమ పెళ్లి పత్రిక కాస్త డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటారు. తమ ఆలోచనలకు తగినట్టుగా పెళ్లి పత్రికలను ఎంపిక చేసుకుంటారు. అయితే టాలీవుడ్ లోని ప్రముఖులు కూడా తమ పెళ్లి పత్రికలను నచ్చినట్టుగా ఎంపిక చేసుకున్నారు. వారి పెళ్లి పత్రికలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఒక లుక్ వేద్దాం.

Advertisement

1) రామ్ చరణ్ -ఉపాసన

రామ్ చరణ్ ఉపాసనల వివాహం 2012 జూన్ 14వ తేదీన జరిగింది. వీరి వివాహ ఆహ్వాన పత్రిక పై KC అనే లోగోతో ఆకట్టుకునే విధంగా ఉంది. కే అంటే కొణిదెల సి అంటే చరణ్.

2) అల్లు అర్జున్- స్నేహ రెడ్డి

అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల వివాహం 2011 మే 5న జరిగింది. వీరి వివాహ ఆహ్వాన పత్రిక సింపుల్ గా అక్షరాల చుట్టూ పువ్వులతో కనిపిస్తోంది. కానీ పెళ్లి పత్రికతో పాటు వీరు ఇచ్చిన స్వీట్లు మాత్రం ఎంతో ప్రత్యేకమైనవి.

3)మెగాస్టార్ చిరంజీవి -సురేఖ

Advertisement

మెగాస్టార్ చిరంజీవి సురేఖను 1980 ఫిబ్రవరి 20న వివాహం చేసుకున్నాడు. వీరి వివాహ ఆహ్వాన పత్రిక ఇంగ్లీష్ లో సింపుల్ గా కనిపిస్తోంది.

4) ఎన్టీ రామారావు- బసవతారకం

1942 మే 2న స్వాతంత్రానికి పూర్వం ఎన్టీ రామారావు బసవతారకం ల వివాహం జరిగింది. స్వాతంత్రానికి పూర్వం ముద్రించబడిన వీరి పెళ్లి పత్రిక ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

5) అల్లరి నరేష్- విరూపమా

2015 మే 29న అల్లరి నరేష్ విరూపమును వివాహం చేసుకున్నాడు. అచ్చమైన తెలుగులో ఉన్న వీరి పెళ్లి పత్రిక ఆకట్టుకునే విధంగా ఉంది.

6) గోపీచంద్- రేష్మా

టాలీవుడ్ హీరో గోపీచంద్ రేష్మ ల వివాహం 2013 మే 12న జరిగింది. వీరి వివాహ ఆహ్వాన పత్రిక పై గోపీచంద్ తండ్రి గారి ఫోటో ఉండటం ప్రత్యేకత.

7) నాగచైతన్య -సమంత

2017 అక్టోబర్ 6 ,7 తేదీలలో నాగ చైతన్య సమంత ల వివాహం జరిగింది. ఒక రోజు హిందూ సాంప్రదాయంలో మరొక రోజు క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరగడమే ఈ వివాహ పత్రిక ప్రత్యేకత.

Also read :గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ ప్రముఖులు వీరే…!

Visitors Are Also Reading