Home » ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు నటి సుధాతో ఆ విషయాలు చెప్పాడా!

ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు నటి సుధాతో ఆ విషయాలు చెప్పాడా!

by Bunty
Ad

టాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచుకున్న హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. చిత్రం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఉదయ్ కిరణ్ వరుస హిట్లతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ముఖ్యంగా అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా ఉదయ్ కిరణ్ పేరు సంపాదించుకున్నాడు. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఆత్మ* చేసుకున్నాడు. కాగా తాజాగా ఉదయ్ కిరణ్ కు తల్లిగా పలు చిత్రాలలో నటించిన నటి సుధ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయి ఉంటారని యాంకర్ ప్రశ్నించగా, అతనిని మానసికంగా ఇబ్బంది పెట్టే ఉంటారని వెల్లడించారు.

Advertisement

 

అది ఎవరన్న దానిని తాను పాయింట్ అవుట్ చేయలేదని అన్నారు. కొంతమంది తమను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో బయట పెడతారని, కానీ కొంతమంది అలా బయట పెట్టకుండా లోలోపలే కుమిలిపోతారని సుధా తెలిపారు. ఉదయ్ కిరణ్ ఎంతో క్షోభ అనుభవించాడని అన్నారు. ఎంతో బాధపడి ఉంటాడని అన్నారు. కొంతమంది ఎన్ని కౌన్సిలింగ్ లు తీసుకున్న కూడా కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడే బాగుంటుందని, ఆ తర్వాత మళ్లీ పరిస్థితి అదే విధంగా ఉంటుందని చెప్పారు. చివరి రోజుల్లో ఉదయ్ కిరణ్ తనను కలవలేదని అన్నారు.

Advertisement

తన అసిస్టెంట్ ను పంపించిన కూడా కలిసేవాడు కాదని, ఇంట్లోనే ఉండి కూడా కలవలేదని చెప్పారు. తాను ఉదయ్ కిరణ్ ను దత్తత తీసుకుందామని అనుకున్నాను అని, ఒకవేళ అదే జరిగితే ఈ పుత్రశోకం తాను అనుభవించాల్సి వచ్చేదేమో అంటూ సుధ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలలో ఉదయ్ కిరణ్ ను దత్తత తీసుకోవాల్సిందని కానీ పరిస్థితుల కారణంగానే అది జరగలేదేమోనని వాక్యానించారు. చివరి రోజులలో తన వద్దకు వచ్చి కాళ్లు పట్టుకొని ఏడ్చారని చెప్పింది. నేను ఒంటరవుతున్న అంటూ ఏడ్చాడని, తాను బిజినెస్ పెట్టిస్తానని చెప్పినా వినలేదని తెలిపారు.

READ ALSO : Cow Hugging : లవర్స్ కి అలర్ట్… ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదట… “కౌ హాగ్ డే”నట..!

Visitors Are Also Reading