ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rashi phalau in telugu 30.11.2022: మేషం
మీ మీ రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
Today rashi phalau in telugu: వృషభం
శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బంధు, మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టే పనుల్లో ఓర్పు చాలా అవసరం. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి.
Today rashi phalau in telugu: మిథునం
కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.
Today rashi phalau in telugu : కర్కాటకం
ఏకాగ్రతతో పని చేస్తే విజయం త్వరగా సిద్ధిస్తుంది. కుటుంబ సభ్యులతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది.
Today rashi phalau in telugu : సింహం
సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి.
Today rashi phalau in telugu : కన్య
గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఓ శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది.
Advertisement
Today rashi phalau in telugu : తుల
ప్రారంభించబోయే పనుల్లో ఆపదలు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు పొందుతారు. సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి.
Today rashi phalau in telugu : వృశ్చికం
పనిలో మనోభిష్టం నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. శారీరక శ్రమ పెరుగుతుంది.
Today rashi phalau in telugu : ధనుస్సు
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడుతాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కీలకమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. గతంలో ఆగిన పనులను తిరిగి ప్రారంభిస్తారు.
Today rashi phalau in telugu : మకరం
ప్రారంభించిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలను రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి.
Today rashi phalau in telugu : కుంభం
ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. శ్రమ ఫలిస్తుంది.
Today rashi phalau in telugu : మీనం
కీలకమైన వ్యవహాారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలను ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు.