ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rashi phalau in telugu 17.11.2022: మేషం
ప్రారంభించబోయే ముందు పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో విబేధాలు రావచ్చు.
Today rashi phalau in telugu: వృషభం
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.
Today rashi phalau in telugu: మిథునం
ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు ధనం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
Today rashi phalau in telugu : కర్కాటకం
శ్రద్ధగా పని చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది.
Today rashi phalau in telugu : సింహం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇది మీకు అనుకూలమైన సమయం. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది. మన:సౌఖ్యం ఉంటుంది.
Today rashi phalau in telugu : తుల
అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయ పాలనతో పనులను పూర్తి చేస్తారు.
Today rashi phalau in telugu : వృశ్చికం
మంచి పనులను చేపడుతారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి.
Today rashi phalau in telugu : ధనుస్సు
ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాల గురించి కాలాన్ని వృథా చేయకండి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడడం ఉత్తమం.
Today rashi phalau in telugu : మకరం
ప్రారంభించిన పనులను సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి.
Today rashi phalau in telugu : కుంభం
కొన్ని కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు.
Today rashi phalau in telugu : మీనం
మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్ కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.