తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అవి ఒరిజినల్ దృశ్యాల లేక పాత ఫోటోల ద్వారా వీడియో రూపొందించారా అనే అంశాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ పంపమన్నారు.
Advertisement
మరోవైపు ఈ ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అదృశ్యాలు వైరల్ కావడంపై టిటిడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.టీటీడీ చేసిన ఫిర్యాదుతో తిరుమల ఒకటో పట్టణ పోలీసులు ఐకాన్ అనే సంస్థకు చెందిన కిరణ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 447 ఆలయ భద్రతా నిబంధన ఉల్లంఘన అసాంఘిక శక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
నిందితుడు కిరణ్ హైదరాబాదులో ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అతడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టిటిడి చర్యలు మొదలు పెట్టింది. తిరుమల శ్రీవారి దేవాలయ భద్రతా వలయంలో యాంటీ డ్రోన్ టెక్నాలజీని వినియోగించినందుకు పరిశీలన చేస్తోంది. ఆలయ భద్రత నిబంధనలు ఉల్లంఘించేందుకు ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి హెచ్చరించారు.
READ ALSO : Michael Trailer : ‘మైఖేల్’ ట్రైలర్ రిలీజ్..దుమ్ములేపిన సందీప్