Home » Michael Trailer : ‘మైఖేల్’ ట్రైలర్ రిలీజ్..దుమ్ములేపిన సందీప్

Michael Trailer : ‘మైఖేల్’ ట్రైలర్ రిలీజ్..దుమ్ములేపిన సందీప్

by Bunty
Ad

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. యువ హీరోల్లో అసలు ఏమాత్రం లక్ కలిసి రాని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సందీప్ కిషన్ అని చెప్పొచ్చు. సినిమాలైతే చేస్తున్నాడు కానీ వాటికి తగిన ఫలితాలను రాబట్టడంలో మాత్రం వెనుకబడ్డాడు సందీప్ కిషన్. ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ లేకుండా సతమతమవుతున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ఈ తరుణంలోనే సందీప్ కిషన్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’.

Advertisement

రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్, హీరో వరుణ్ సందేశ్, అనసూయ కీలక పాత్రలో నటించారు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడమే కాకుండా మైఖేల్ సినిమాపై అంచనాలను కూడా పెంచింది. ఇక ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా మూవీ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది.ప్రస్తుతమైతే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

Advertisement

ఇక ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ నేడు వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ ను తెలుగులో నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేయగా, తమిళ్ లో జయం రవి, అనిరుద్ అలానే మలయాళం లో నివిన్ పౌలు రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. సందీప్ కిషన్ మేకోవర్, అలానే యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

READ ALSO : బాలయ్య వివాదస్పద వ్యాఖ్యలు..అక్కినేని..తొక్కినేని అంటూ !

Visitors Are Also Reading