Home » Tilak Varma : ఆసియా కప్ లోకి తిలక్ వర్మ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ !

Tilak Varma : ఆసియా కప్ లోకి తిలక్ వర్మ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ !

by Bunty
Ad

గతంలో టీమిండియాలో మిడిల్ చాలా బలంగా ఉండేది. యువరాజ్ సింగ్, సురేష్ రైనా లాంటి నమ్మకమైన ప్లేయర్స్ జట్టు భారాన్ని మోసేవారు. కానీ వారు రిటైర్ అయ్యాక ఆ ప్లేస్ లోకి చాలామంది వచ్చినా రాణించలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్న గాయాల పాలవుతూ ఫిట్నెస్ లేక జట్టుకు దూరమయ్యాడు. ఇక మరో ప్లేయర్ కేఎల్ రాహుల్ ఆసియా కప్ లో ఆడడానికి రెడీ అయ్యారు. ఐపీఎల్ లో గాయపడిన రాహుల్ కొన్ని సిరీస్ లకు దూరమైన కూడా ఆసియా కప్ లో ఆడడానికి సిద్ధంగా సిద్ధమయ్యారు.

Advertisement

దాంతో అతన్ని ఆసియా కప్ లో సెలెక్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. గిల్, రోహిత్ ఓపెనింగ్ జోడి కావడంతో రాహుల్ కు ఓపెనింగ్ ఛాన్స్ దక్కదు. ఇక మిడిలార్డర్ లో రాహుల్ కన్నా మరో ప్లేయర్ తిలక్ వర్మను తీసుకోవడం బెటర్ అని మాజీ ప్లేయర్స్ సలహా ఇస్తున్నారు. ఇటీవలే జరిగిన విండీస్ టూర్ లో టి20లో అంతర్జాతీయ ఎంట్రీ ఇచ్చిన తిలక్ అద్భుత ప్రదర్శన చేశారు. ఐదు మ్యాచుల్లో కూడా రాణించాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఐదు మ్యాచ్లు ఆడిన తిలక్ వర్మ 173 పరుగులు చేశాడు. 57 యావరేజ్ తో అతని బ్యాటింగ్ చేయడం విశేషం. మొదటి సిరీస్ లోనే ఈ స్థాయిలో రాణించడంతో అతను ఎంత ఫామ్ లో ఉన్నాడో అర్థమవుతుంది. అందుకే ఆసియా కప్ లో రాహుల్ కన్నా తిలక్ బెటర్ అని ఇండియన్ మాజీ కోచ్ రవి శాస్త్రి తెలిపారు.

Advertisement

రాహుల్ నీ అప్పుడే ఆసియా కప్ లో ఆడించాల్సిన అవసరం లేదని… అతని ప్లేస్ లో తిలక్ వర్మను సెలెక్ట్ చేయాలని సూచించారు. ఇక గాయపడిన శ్రేయస్, రాహుల్ ఇద్దరు ఆసియా కప్ నాటికి సిద్ధమవుతారని భావించారు. కానీ రాహుల్ మాత్రమే ఫిట్నెస్ సాధించాడు. ఇక మాజీలు, ఫ్యాన్స్ కూడా తిలక్ కు వన్డేల్లో ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఐపీఎల్ లో దుమ్ములేపిన తిలక్ వెస్టిండీస్ తో జరిగిన టి20 సిరీస్ లకు సెలెక్ట్ అయ్యాడు. మొదటి మ్యాచ్ లోనే 30 పరుగులు చేసిన తిలక్ రెండో మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈనెల 30 నుండి ఆసియా కప్ ప్రారంభం కానుంది. పాకిస్తాన్, శ్రీలంక దేశాలు టోర్నిని నిర్వహిస్తాయి. ఇండియా మ్యాచ్ ఆడే మ్యాచ్ లు అన్నీ శ్రీలంకలో జరుగుతాయి. త్వరలోనే ఆసియా కప్ కు బీసీసీఐని ప్రకటించే అవకాశం ఉంది. మరి ప్రతిష్టాత్మక ఈ టోర్నిలో తిలక్ వర్మకు ఛాన్స్ వస్తుందా లేదా అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి 

ఏజెంట్, భోళా ఢమాల్.. అయ్యయ్యో అనిల్ సుంకర పరిస్థితి ఏందీ?

హీరోలను మించి అనిరుధ్ రెమ్యూనరేషన్… ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు…?

Sanju Samson : బాబు కెరీర్ క్లోజ్.. ఇక ఐపీఎల్‌ ఆడుకో !

Visitors Are Also Reading