ఏపీలో సినిమా టికెట్ల ధరలను పెంచాలని టికెట్ల ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని పలువురు సీనీ ప్రముఖులు కోరుతున్న సంగతి తెలిసిందే. అక్కడ అలా ఉంటే తెలంగాణలో ప్రభుత్వం ధరలను పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఇక ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ లలో ధరలు అమాంతం పెరిగిపోయాయి. మల్టీప్లెక్స్ లలో టికెట్ ధరలు రూ.300 నుండి రూ.350 చేరుకున్నాయి. అయితే కరోనా ఎఫెక్ట్ తో రాధేశ్యామ్ మరియు ఆర్ఆర్ఆర్ సినిమాలు పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
ఆ రెండు సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడంతో దాదాపు తొమ్మిది తక్కవ బడ్జెట్ సినిమాలతో పాటూ నాగార్జున హీరోగా నటించిన బంగార్రాజు సినిమా కూడా విడుదలకు సిద్దం అవుతోంది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలకు కూడా ప్రేక్షకులు రూ.300 నుండి రూ.350 పెట్టలేరు. కానీ కనీసం వారం అయినా మల్టీప్లెక్స్ లలో ఆ ధరలతో సినిమాలు రన్ అయ్యాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మల్టీ ప్లెక్స్ లో 300 పెట్టి సినిమా చూడటం చాలా కష్టం అని అంతే కాకుండా ధరలు ఆ రేంజ్ పెరగటంతో విమర్శలు వచ్చాయి.
also read : Viral video : “ఊ అంటావా” మేకింగ్ వీడియో…సమంత ఇంత కష్టపడిందా…?
దాంతో హైదరాబాద్ లో మల్టీ ప్లెక్స్ లు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ధరలను తగ్గించాల్సి వచ్చింది. ఇక తాజాగా హైదారాబాద్ లోని మల్టీ ప్లెక్స్ లు మరియు థియేటర్లలో టికెట్ ధరలు రూ.200, రూ.150. రూ.175 కు చేరుకున్నాయి. దాంతో రేపటి నుండి ఆడే సినిమా టికెట్ల ధరలు ఇదే విధంగా ఉంటాయి. కాబట్టి సినిమా ప్రియులు మల్లీ టెన్షల్ లేకుండా సినిమాలు చూడవచ్చు.