Home » Viral video : “ఊ అంటావా” మేకింగ్ వీడియో…సమంత ఇంత కష్టపడిందా…?

Viral video : “ఊ అంటావా” మేకింగ్ వీడియో…సమంత ఇంత కష్టపడిందా…?

by AJAY

ప్రస్తుతం ఎక్కడ చూసినా సమంత జోరు కనిపిస్తోంది. విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటివరకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ వచ్చిన సమంత ప్రస్తుతం పలు విభిన్న పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇది ఇలా ఉంటే సమంత రీసెంట్ గా వచ్చిన పుష్ప మూవీ లో ఐటం సాంగ్ కు స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. మొదటిసారి సమంత ఐటమ్ సాంగ్స్ కు డాన్స్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ పాట కాస్తా వివాదాల్లో చిక్కుకోవడం మరో ఎత్తు.

O antva oo antavata

O antava oo antvata

ఊ అంటావా మామ ఊ ఊ అంటావా అంటూ సాగే ఈ పాట లిరిక్స్ పై పురుష సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మగవాళ్ళ మనోభావాలను దెబ్బతీసేలా ఈ పాట లిరిక్స్ ఉన్నాయని పురుషుల సంఘం కోర్టుకు సైతం వెళ్లడం తెలిసిందే. కానీ ఈ పాట థియేటర్లలో విడుదల కాగా ఆడియన్స్ నిలుచుని మరీ స్టెప్పులు వేశారు.

మరోవైపు ఈ పాట విడుదలైన నాటి నుండి యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో పాట ఎంతో హైలెట్ గా నిలిచింది. అయితే ఈ పాటకు డాన్స్ చేయడం కోసం సమంతా ఎంతగానో కష్టపడింది. తాజాగా ఈ పాట కోసం సమంత ఎంత కష్ట పడిందో తెలిసేలా ఈ పాట మేకింగ్ వీడియోను విడుదల చేశారు. మేకింగ్ వీడియోలో కొరియోగ్రాఫర్ ఎలా చెబితే అలా స్టెప్పులు వేస్తూ సమంత ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Visitors Are Also Reading