Home » ఉదయాన్నే టీ , కాఫీలు తాగే వారు ఈ జాగ్రత్తలు పాటించండి.. లేదంటే ప్రమాదమే..!

ఉదయాన్నే టీ , కాఫీలు తాగే వారు ఈ జాగ్రత్తలు పాటించండి.. లేదంటే ప్రమాదమే..!

by Anji
Ad

సాధారణంగా చాలా మంది ఉదయం నిద్రలేవగానే టీ, కాఫీ తాగుతుంటారు. టీ లేదా కాఫీ తాగనిది కొంత మంది ఏ పనిని ప్రారంభించరు. అలా టీ, కాఫీలకు బానిసలు అయిపోయారు. చాలా మంది టీ, కాఫీలు ఎనర్జీ డ్రింక్ అని అనుకుంటారు. ఉదయాన్నే వాటిని సేవించడం వల్ల తాము ఎనర్జీటిక్ గా ఉంటామని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. పరిగడుపున టీ కాఫీలు తాగటం వలన ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్లాలు పెరిగి జీర్ణ వ్యవస్థ పై చెడు ప్రభావం పడుతుంది. ఇది బరువు పెరగటానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి. 

Advertisement

ఉదయం లేవగానే టీ కాఫీలను సేవించడం వల్ల కడుపు లోపలి భాగం దెబ్బతింటుంది. దీంతో అల్సర్లకు దారితీస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వలన శరీరంలో చక్కెర కరిగిపోతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. ఊబకాయం వస్తుంది. ప్రతిరోజు కప్పుల కొద్ది టీ త్రాగటం వలన స్కెలిటల్ ఫ్లోరోసిస్ వంటి వ్యాధి వస్తుంది. దీనివలన ఎముకలు లోపల బోలుగా ఉంటాయి. ఇది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. టీ త్రాగటం వలన తాజాదనం వస్తుందని అంటుంటారు. ఉదయాన్నే టీ తాగటం వల్ల అలసట చిరాకు కలుగుతాయి అన్నది నిజం.

Advertisement

నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన కడుపులో గ్యాస్ ఏర్పడడంతోపాటు జీర్ణ క్రియ మందగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగటం వలన పిత్త ప్రక్రియ నిరోధిస్తుంది. దీంతో వికారం, చంచలతను పెంచుతుంది. ఎక్కువగా టీ కాఫీలు తాగితే నిద్రలేమితో పాటు ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ఉదయాన్నే వేడి టీ తాగటం వలన శరీరంలో కెఫీన్ కరిగిపోతుంది. దీనివలన రక్త పోటు ప్రభావితం అయ్యి గుండె సమస్యలకు దారితీస్తుంది. అయితే ఉదయాన్నే టీ కాఫీలు తాగే అలవాటు ఉంటే ఖాళీ కడుపుతో టీ తాగే బదులు దాంతో పాటు బిస్కెట్ లేదా చిరుతిండ్లను తీసుకోవచ్చు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మహిళలు చేసే ఈ తప్పుల వల్లే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట…!

వేప ఆకులతో జుట్టు సమస్యలు దూరం..!

Visitors Are Also Reading