చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. నిజానికి మనం వాస్తు ప్రకారం పాటించడం వలన అనేక మార్పులు జరుగుతాయి. మనలో చాలా మంది నరదృష్టి తగలకుండా అనేక పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ప్రధాన ద్వారం మీద లోపల నుండి బయటకి దేవుళ్ళు ఫోటోలని పెడుతుంటారు. ఎక్కువగా గణపతి ఫోటోలని, గజలక్ష్మి ఫోటోలని ముఖద్వారానికి తగిలిస్తూ ఉంటారు. చాలామంది హిందువులు ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. ఇంటి ప్రధాన ద్వారం మీద దేవుళ్ళ ఫోటోలు ఉంచొచ్చా..? దాని వలన మంచి జరుగుతుందా లేదంటే చెడు జరుగుతుందా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
Advertisement
ఇంటికి చాలా ముఖ్యమైన వాటిల్లో ప్రధాన ద్వారం ఒకటి. ఈ ద్వారం గుండా మనం ఇంట్లోకి బయటికి రాకపోకలు సాగిస్తూ ఉంటాము. ఇంటికి బంధువులు బయట వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా ఇలానే వస్తారు. అయితే ఇంటి ప్రధాన ద్వారానికి బయటవైపు ఎటువంటి దేవుళ్ళ ఫోటోలును ఉంచకూడదని పండితులు అంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఇలా ఉంచాలి అనుకుంటే శంకు చక్రాలని నామాల ఫోటోలని పెట్టొచ్చు.
Advertisement
Also read:
Also read:
ఇంటి ప్రధాన ద్వారానికి లోపల వైపు లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టడం మంచిది. లేదంటే లక్ష్మీదేవి ఫోటోని గణపతి ఫోటోని కులదేవత ఫోటోలని పెట్టొచ్చు. ఇలా చేయడం వలన నరదిష్టి వాస్తు దోషం తొలగిపోతాయి. వాస్తు దోషాల నుండి బయట పడాలంటే ఐశ్వర్య కాళీ ఫోటోని లేకపోతే గోమాత సమేత ఐశ్వర్య కాళీ ఫోటో ని పెట్టొచ్చు ఇలా చేయడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి. చాలామంది ఇంటి అందాన్ని బయట నుండి చూసి లోపలికి చెడు దృష్టితో ఆలోచిస్తూ వస్తారు. ఈ చెడు దృష్టి మన మీద పడకుండా ఉండాలంటే గోమాత సమేత ఐశ్వర్య కాళీ ఫోటో ని పెట్టడం మంచిది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!