అలీరేజా బిగ్‌బాస్ షోతో ఫేమస్ అయ్యారు. ఇక అప్పటి నుంచి పలు సినిమాల్లో కూడా నటించారు. ముఖ్యంగా నాగార్జున వైల్డ్‌డాగ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలీతో సరదాగాలో జరిగిన కార్యక్రమంలో ఆయన అలీతో పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా అలీరేజా రెండు సంవత్సరాల కాలం టెలివిజన్ ఇండస్ట్రీకి ఎందుకు దూరం అయ్యాడో ఆయన ఏమి చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
సీరియల్ వాళ్లు నాకు ఆపర్ ఇచ్చారు. అదే సమయంలో నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. అది నేను చేస్తే ఓ హైప్‌వస్తుందని చెప్పాను. నా డ్రీమ్ కు కొంచెం దగ్గర ఉంది. నేను అక్కడికి వెళ్తాను అన్నాను. తొలుత వాళ్లు ఒప్పుకోలేదు. ఆ తరువాత ఒప్పుకున్నారు. బిగ్ బాస్‌లోంచి బయటకు వచ్చే ముందే నాగార్జున వైల్డ్‌డాగ్ సినిమాలో మరో అవకాశం వచ్చింది. అలీరేజా అనే కుర్రాడు లోపల ఉన్నాడు. ఆ క్యారెక్టర్‌కు కాస్టింగ్ ఎవరికీ చేయకండి అని ముందే నాగార్జున దర్శకునికి చెప్పేశారు.నువ్వు బాధ పడకు ఇక్కడి నుంచి బయటికి వెళ్లిన తరువాత గ్రేట్ వెయింటింగ్ ఫర్ యూ నాగార్జున చెప్పారు. మేనేజర్ నుంచి నెంబర్ తీసుకున్నాను. సినిమా ఆఫర్ వచ్చింది ఆ సీరియల్ కూడా కంటిన్యూ చేస్తాను అని చెప్పానని వెల్లడించారు.
Advertisement
సీరియల్‌ను మూసేస్తున్నట్టు అప్పటి ప్రకటించినట్టు సమాచారం. రేపే మనం షూటింగ్ ప్రారంభిస్తాం నువ్వు రావాలని చెప్పారు. అప్పటికే ఓ షాపింగ్ మాల్ ఓపెన్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాను. న్యూస్ పేపర్‌లో ప్రకటన కూడా ఇచ్చారు. అప్పటికప్పుడు ఎలా వస్తాను కుదరదు అని చెప్పాను. మా అందరికీ వ్యతిరేకంగా వెళ్తున్నావని చెప్పారు. ఓరోజు నాగార్జున గారి వైల్డ్‌డాగ్ షూటింగ్‌లో ఉన్నప్పుడు సీరియల్ వాళ్లు నాకు ఫోన్ చేసి వెంటనే ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు రావాలన్నారు. నేను 80 కిలోమీటర్ల దూరంలో షూటింగ్ చేస్తున్నాను. నేను ఒక్కన్నే ఉన్నాను. నేను ఇప్పుడు రావడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని చెప్పాను. రెండోసారి కూడా నాపై వ్యతిరేకత పెంచుకున్నారు.
ముఖ్యంగా మేము పిలుస్తున్నా.. రావడం లేదు అని.. తనపై నెగిటివ్ రూమర్స్ పుట్టించారు. నాకు తెలిసిన ఓ మేనేజర్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను నాకు ఓ సందేశం పంపాడు. ప్రొడ్యూసర్, డైరెక్టర్స్‌కు అందరికీ కలిపి ఉన్న గ్రూపులో అలీ రేజా అనే యాక్టర్‌ను 2 సంవత్సరాల పాటు బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. నాకు అప్పుడు ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు. బిగ్ బాస్‌లో సంపాదించిందంత ఓ ప్లాట్ కొనుగోలు చేశాను. అకౌంట్‌లో జీరో ఉంది. కేవలం నేను సినిమాల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు ఇలా చేశారని చెప్పుకొచ్చారు అలీ రేజా.
Also Read : భారత్‌లో కొత్త వైరస్.. లక్షణాలు ఏమిటంటే..?