పెళ్లి అంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు, పిల్లా పాపలు అలా సాగుతూ వెళ్లే సంసారం.. అలా పెళ్లి చేసుకున్న కొత్తలో భార్యాభర్తల మధ్య ప్రేమలు ఒకరకంగా ఉంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత మరో రకంగా ఉంటాయి. పిల్లలు పెరుగుతుంటే ఇంకో రకంగా ఉంటాయి. ఇక 40 ఏళ్లు దాటిందంటే మరోరకంగా ప్రేమలు మారుతాయి.. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన మహిళలు వారి భర్తల్లో కోరుకునేది ఏంటో ఇప్పుడు చూద్దాం ..
also read:ఈ ఐదుగురు ఆటగాళ్లకు ఇదే చివరి ఐపీఎల్.. వారు ఎవ్వరంటే..?
Advertisement
ఇతర మహిళలతో పోల్చకూడదు :
ముఖ్యంగా మహిళల్లో జీవ సంబంధమైన మార్పులు వేగంగా పెరుగుతాయని నిజం.. ఈ కారణంగా 40 ఏళ్ల వయసు వచ్చేసరికి కొంతమంది మహిళలు కాస్త బరువు పెరిగి, భర్త కంటే పెద్దవారిలా కనిపిస్తూ ఉంటారు. ఈ తరుణంలో చాలామంది పురుషులు తన భార్య అందంగా నాజుగ్గా ఉండాలని భావిస్తారు. కానీ భార్య మాత్రం తన భర్త పరాయి అమ్మాయిని చూడవద్దని కోరుకుంటుంది. ఈ తరుణంలో పరాయి స్త్రీతో తనను పోల్చి కించపరచకూడదని భావిస్తుంది.
నిజాయితీ:ప్రతి మహిళ తన జీవిత భాగస్వామి నిజాయితీగా ఉండాలని కోరుకుంటుంది. నిజాయితీగా ఉన్న పురుషులు స్త్రీలను ఎక్కడా కూడా మోసం చేయరు. కాబట్టి భర్త దగ్గర నుంచి నిజాయితీనే కోరుకుంటారు స్త్రీలు.
Advertisement
also read:ఉస్తాద్ భగత్ సింగ్ పై పవన్ ఫ్యాన్ ట్వీట్..అలాంటి రిప్లై తో డైరెక్టర్ కౌంటర్ ఎటాక్..!
ప్రేమను కోరుకోవడం :
40 ఏళ్లు దాటిన తర్వాత కొంతమంది భర్తలు వారి భార్యలను విస్మరిస్తారు. అది బిజీ లైఫ్ రిత్యా కావచ్చు, లేదంటే వారు బోర్ కొట్టి అలా చేయవచ్చు. ఈ సమయంలో చాలామంది మహిళలు వారి భర్త ప్రేమగా చూసుకుంటూ ప్రేమగా గడపాలని కోరుకుంటారు. ఈ టైంలో వారి భార్యలకు ఐ లవ్ యు అనే ఒక మాట చెబితే చాలు వారికి మీపై మరింత ప్రేమ పెరుగుతుంది. 40 ఏళ్ల వయసులో కూడా ఇంకా హ్యాపీగా చూసుకుంటారు.
శృ*ర ధ్యాస :
40 ఏళ్లు దాటిన తర్వాత చాలామంది మహిళలకు, పిల్లలు పెద్దవుతారు. పై చదువుల కోసం బయటకు వెళ్తుంటారు. ఈ తరుణంలో స్త్రీలకు కాస్త రిలీఫ్ దొరుకుతుంది. అప్పుడు భర్త తనతో ప్రేమగా ఉండాలని కోరుకుంటారు.. కాస్త శృ**ర జీవితంపై కూడా కోరిక పుడుతుంది. తన భర్త కనీసం తనతో ఆ విధంగా గడపాలని కోరుకుంటారట..
also read:రంజాన్ ఉపవాసం వేళ ఎనర్జీ గా ఉండాలంటే.. ఇవి తప్పక పాటించాల్సిందే..?