ఆర్ఆర్ఆర్ ఇంటర్నేషనల్ వేదికల మీద తెలుగు సినిమా సత్తాను చాటిన మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. జక్కన్న తీర్చిదిద్దిన కళాఖండంగా ఎప్పటికీ జనాల మనస్సుల్లో ఉండిపోతుంది. ఆ సినిమా మేనియా నుంచి బయటపడటం అంత ఈజీ కాదు. ఆ సినిమాను మరిచిపించేలా ఇంకో మూవీని సెలక్ట్ చేసుకోవడం కూడా అంత తేలిక కాదన్నది క్రిటిక్స్ మాట. అయినా, తమ వంతు కృషి చేశారు ఇద్దరు నాయకులు. ట్రిపుల్ ఆర్ తర్వాత స్టోరీ సెలక్షన్‌లో చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
Advertisement
Advertisement
అంతకు ముందు చేయని, చేసిన దర్శకుల లిస్టు పట్టుకుని ఎవరైతే పర్ఫెక్ట్ సినిమా చేస్తారో ఏరికోరి మరీ ఎంపిక చేసుకున్నారు. జానర్లను ఎంపిక చేసుకోవడంలోనూ అత్యంత కేరింగ్‌గా వ్యవహరించారు. అయినా, సినిమాల విడుదలలో మాత్రం జాప్యం జరుగుతూనే ఉంది. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా చేస్తున్న గేమ్ చేంజర్ ఇదిగో విడుదలవుతుంది, అదిగో విడుదలవుతుందంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ ఏడాదే ఉంటుందంటూ మేకర్స్ నుంచి హింట్స్ కనిపిస్తున్నా, ఇప్పటిదాకా పక్కాగా పలానా రిలీజ్ డేట్ అంటూ క్లారిటీ లేదు. అటు తారక్ విషయంలోనూ అంతే. కలిసొచ్చిన కొరటాలతో దేవర జర్నీ మొదలుపెట్టారు. కానీ ఆ మూవీ ఏప్రిల్ 05న విడుదలవుతుందని ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు అక్టోబర్ 10కి వాయిదా పడిన విషయం తెలిసిందే. అటు నార్త్ లోనూ వార్2కి సైన్ చేశారు. వీటిలో ఒక్కటైనా ఈ ఏడాది విడుదలయితే బాగుంటుందని ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.
Also Read : మనదేశం సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమైన ముగ్గురు లెజెండ్స్ ఎవరో చెప్పగలరా ?