Home » టాలీవుడ్ లవబుల్ కపుల్ మహేష్ బాబు- నమ్రత లవ్ స్టోరీలో దాగి ఉన్న రహస్యం ఇదే..!

టాలీవుడ్ లవబుల్ కపుల్ మహేష్ బాబు- నమ్రత లవ్ స్టోరీలో దాగి ఉన్న రహస్యం ఇదే..!

by Anji
Ad

ప్రపంచమంతా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుగా చాలా ఘనంగా నిర్వహించుకుంటారనే విషయం మనందరికీ తెలిసిందే.  భారత్ లో కూడా వాలైంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ అనగానే మహేష్-నమ్రత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటి నమ్రతా శిరోద్కర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

mahesh-babu-marriage

Advertisement

మహేష్ బాబు-నమ్రత కాంబోలో వచ్చిన మూవీ వంశీ. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కోసం న్యూజిలాండ్ కి వెళ్లారు. అక్కడే నెల రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఈ సమయంలోనే మహేష్ బాబు, నమ్రత మద్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. షూటింగ్ పూర్తయి తిరిగి వచ్చిన తరువాత తొలుత నమ్రతనే తన ప్రేమను మహేష్ బాబుకి వ్యక్తపరిచారట. ఈ తరుణంలో మహేస్ బాబు కూడా ఓకే అనడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు దారి తీసిందట. మహేష్-నమ్రత పెళ్లికి తొలుత మహేష్ కుటుంబం అంగీకారం చెప్పలేదట.

Advertisement

కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మహేష్ తన సోదరి మంజుల సాయం తీసుకున్నారట. ఆమెతో పాటు దర్శకుడు జయంత్ కూడా సాయం చేశారట.  ఇలా ట్విస్ట్ ల తరువాత ఫిబ్రవరి 10, 2005లో మహేష్ బాబు-నమ్రత ప్రేమ పెళ్లిగా మారింది. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. లవబుల్ కపుల్ గా ప్రేక్షకుల అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న మహేష్ బాబు, నమ్రత దంపతులకు గౌతమ్, సితార సంతానం. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో ఓ సినిమా చేయనున్నారు. ఇటీవలే గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Also Read :  నాగేశ్వర రావును మెచ్చుకుని, ఎన్టీఆర్ ని ద్వేషించిన ఆ హీరో ఎవరో తెలుసా..?

 

Visitors Are Also Reading