ఆషాడ మాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా ఆషాడ మాసం వచ్చిందంటే కొత్తగా పెళ్లి అయిన కోడలు అత్త మొహం చూడకూడదు అని తల్లిగారి ఇంటికి పంపిస్తుంటారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఆషాడ మాసం ఈరోజు నుంచే ప్రారంభమైంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే ఆషాడమాసం వర్ష రుతువులో గోరింటాకు పెట్టుకుంటే చర్మవ్యాధుల బారి నుండి రక్షణ పొందవచ్చు అనేది ఆరోగ్య రహస్యం. ఈ మాసంలో వానలు కురవడంతో పంట పొలాలు బురదమయమై, క్రిమికీటకాలు పెరుగుతాయి. మహిళలు వాటిలో కాళ్లు, చేతులు ఆడిస్తూ పని చేస్తుంటారు. కాబట్టి చర్మ రోగాలు దరిచేరకుండా గోరింటాకును పెట్టుకునేవారు.
ప్రస్తుతం రకరకాల మెహిందీ డిజైన్లు మార్కెట్‌లోకి వాడకలోకి రావడం వల్ల అందం కోసం గోరింటాకును మహిళలు అలంకరించుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వేడుకల సమయంలో మెహిందీ వాడుతున్నారు. ఇక ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక పలు శాస్త్రీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గోరింటాకు వల్ల గోర్లకు అందం రావడమే కాకుండా గోరు చుట్టూ వంటివి రాకుండా ఉంటాయి. ఈ మాసం సందర్భంగా కొన్ని ప్రాంతాల మహిళా సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో మహిళలందరూ సామూహికంగా గోరింటాకు వేడుకలు నిర్వహిస్తుంటారు.
Advertisement
Advertisement
ఆషాడమాసం ఇక పండుగలకు ప్రత్యేకత అనే చెప్పవచ్చు. జులై 10న ఏకాదశి, జులై 12వ తేది గురుపౌర్ణమి పండుగలు రానున్నాయి. ఆషాడ మాసంలో బోనాల వేడుకలను జరుపుకుంటారు. గ్రామ దేవతలకు బోనాలతో మొక్కులు సమర్పిస్తారు. ఆషాడ శుద్ధ పాడ్యమి నుంచి బహుళ అమవాస్య వరకు బోనాల వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇక హైదరాబాద్ నగరంలో అయితే బోనాల పండుగను ఎంత వైభవంగా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే.
Also Read :
ఈటీవీలో వచ్చే ఆలీతో సరదాగా టాక్ షోను జనాలు ఎంతవరకు చూస్తున్నారంటే..?
ఈ మూడు పదార్థాలు తిన్న తరువాత వేడినీరు, చాయ్ అస్సలు తాగకూడదు..అవి ఏమిటంటే..?