Home » చలికాలంలో ఇది తీ ఆరోగ్యం అమృతమే..!

చలికాలంలో ఇది తీ ఆరోగ్యం అమృతమే..!

by Anji
Ad

చలికాలంలో సరైన జీవనశైలి, ఆహారాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. చలికాలంలో చిన్న పొరపాటు కూడా అనారోగ్యానికి దారి తీస్తుంది. చల్లటి వాతావరణంలో శరీరంలో రోగనిరోధక శక్తి తరచుగా బలహీనపడుతుంది. దీంతో శరీరం జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులకు గురవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఆహారాన్ని మార్చడం చాలా ముఖ్యం. చలికాలంలో బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది బీట్‌రూట్‌ను సలాడ్ రూపంలో తింటారు. మరికొందరు దాని రసాన్ని తాగడానికి ఇష్టపడతారు. ఇందులో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్, విటమిన్లు వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఉదయాన్నే బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చలికాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Advertisement

రక్తహీనతతో బాధపడేవారు తమ ఆహారంలో బీట్‌రూట్‌ను ఏ రూపంలోనైనా చేర్చుకోవచ్చు.. రక్తహీనత ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో బీట్‌రూట్ జ్యూస్ తాగితే అద్భుత ఫలితం ఉంటుంది.

Advertisement

స్థూలకాయంతో బాధపడే వారికి బీట్‌రూట్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా తక్కువ కేలరీలు కలిగి ఉండి కొవ్వులో పూర్తిగా సున్నా శాతం ఉంటుంది. ఈ కారణంగా బీట్‌రూట్‌ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చలికాలంలో ఉదయాన్నే పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తాగితే కొవ్వు తగ్గుతుంది.

ఇది శరీరంలోని ట్రైగ్లిజరైడ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.

బీట్‌రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, కడుపునొప్పి వంటి పొట్టకు సంబంధించిన రుగ్మతలు దూరమవుతాయి.

Visitors Are Also Reading