సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారే. దాదాపు అలా చిన్ననాటి పాత్రలో నటించి ఆ తర్వాత చదువుల మీద దృష్టి పెట్టి కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమై.. ఆ తర్వాత ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వారిని గుర్తుపట్టడం కష్టంగా మారుతుంది. ఆ విధంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన మూవీ గ్యాంగ్ లీమోవిడర్. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఐదుగురు ఆడవాళ్లు చాలా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
Advertisement
ఈ ఐదుగురు మహిళా పాత్రల్లో శ్రీయ రెడ్డి కూడా ఒకరిగా నటించింది. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన శ్రియా రెడ్డి చిత్రం తర్వాత మరోసారి ఎక్కడ కనిపించలేదు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే అమెరికా వెళ్లి అక్కడ పై చదువులు పూర్తి చేసిందట. హైదరాబాద్ కు చెందిన శ్రీయ రెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
Advertisement
తాను 5, 6వ తరగతిలో ఉన్నప్పుడు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాస్‌లోకి వెళ్లేదాన్ని, ఆ తర్వాత నేను ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న సమయంలో శేఖర్ కమ్ముల సినిమా ఆడిషన్స్‌కి వెళ్లానని తెలియజేసింది. అక్కడ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ నన్ను చూసి డైరెక్టర్ విక్రమ్ కుమార్ కు నా ఫోటోలు చూడమని చెప్పారు. ఇక వెంటనే నన్ను పిలిచి సెలెక్ట్ చేసేసారు. అలా టీనేజ్ లో కనిపించిన శ్రియ లేటెస్ట్ ఫోటోల్లో చాలా అందంగా ఉంది. ఆ టీనేజ్ అమ్మాయి ఇంత అందంగా తయారయిందా అంటూ కామెంట్ పెడుతున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ప్రైవేట్ జెట్ కొన్న నయనతార.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!