Home » రక్త ప్రసరణ మెరుగ్గా జరగాలంటే.. ఈ ఆహారాలు తప్పనిసరి తీసుకోవాలి..!

రక్త ప్రసరణ మెరుగ్గా జరగాలంటే.. ఈ ఆహారాలు తప్పనిసరి తీసుకోవాలి..!

by Anji
Ad

శరీరంలో ప్రతీ ఆర్గాన్ సరిగ్గా పని చేయాలంటే.. అన్ని భాగాలకు రక్త ప్రసరణ మెరుగ్గా జరగాలి. రక్తప్రసరణ సరిగ్గా ఉంటేనే అన్ని అవయవాలకు రక్తంతో పాటు ఆక్సిజన్ కూడా అందుతుంది. అంతే కాదు మెదడు చురుగ్గా పనిచేయడానికి, గుండె ఆరోగ్యం కోసం మెరుగైన రక్తప్రసరణ తప్పనిసరి. అందుకే శరీరంలో రక్తప్రసరణను పెంచే ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

  • శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరగడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యం. ఇవి రక్త నాళాలలో బ్లడ్ ఫ్లో ఈజీగా జరగడానికి సహాయపడతాయి. అంతే కాదు రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతాయి. అలాగే శరీరంలో బ్లడ్ క్లాటింగ్ సమస్యలను నియంత్రించును. అందుకే మీ డైట్ లో ట్యూనా, ఫ్రెష్ వాటర్ ఫిష్ చేర్చితే మంచి ప్రభావం ఉంటుంది.
  • సిట్రస్ ఫ్రూట్స్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ శరీరానికి చాలా అవసరం. ఇది రక్తంలో బ్లడ్ క్లాట్స్ నియంత్రించి.. రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తుంది. సిట్రిక్ యాసిడ్ అధికంగా లభించే ఆహారాలను మీ డైట్ లో చేర్చండి. గూస్ బెర్రీస్, ఆరెంజ్స్, గ్రేప్స్, లెమాన్స్, ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి.

Advertisement

 

  • నట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా వీటిలోని మెగ్నీషియం, అర్జినైన్, పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అర్జినైన్ రక్తనాళాలను వెడల్పు చేసి.. బ్లడ్ ఫ్లో ఈజీగా జరిగేలా చేస్తుంది. బాదం, పిస్తా, వాల్నట్స్ ఆహారంలో తీసుకుంటే మంచి ప్రభావాన్ని చూపిస్తాయి.
  • వెల్లుల్లి శరీరంలో రక్తపోటును నియంత్రణలో ఉంచి.. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని సల్ఫర్ గుణాలు రక్తపోటును తగ్గించి.. రక్త నాళాలను రిలాక్స్ చేస్తాయి. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది.
  • ఉల్లిపాయలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లెవనాయిడ్స్, రక్త ప్రసరణ సరిగ్గా జరగడానికి తోడ్పడతాయి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు డైలీ డైట్ లో వీటిని తీసుకుంటే రక్తప్రసరణ మెరుగ్గా జరిగి.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

 మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading