Home » ఈ ఏడాది విడిపోయే టాప్ సెలబ్రిటీలు వీరే.. వేణుస్వామి ఏం చెప్పారంటే..?

ఈ ఏడాది విడిపోయే టాప్ సెలబ్రిటీలు వీరే.. వేణుస్వామి ఏం చెప్పారంటే..?

by Anji
Published: Last Updated on
Ad

ప్రముఖుల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణు స్వామి ఎవరికి భయపడకుండా వారి జాతకాలు బయట పెడుతూ కుండబద్దలు కొట్టినట్లు ఎన్నో నిజాలు చెబుతున్నారు. అయితే ఇందులో కొన్నిప్రముఖుల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణు స్వామి..  ఎవరికి భయపడకుండా వారి జాతకాలు బయట పెడుతూ కుండబద్దలు కొట్టినట్లు ఎన్నో నిజాలను చెబుతున్నారు. అయితే ఇందులో కొన్ని నిజాలైతే మరి కొన్ని అబద్ధాలుగా కూడా మారుతున్నాయి. ఇక 2024 కొత్త సంవత్సరం వచ్చిన వేళ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.

venuswamy

Advertisement

ఈ ఏడాది ఎవరెవరు విడిపోతున్నారు అనేది కూడా బయటపెట్టారు . ఈ ఏడాది ఇద్దరు టాప్ సెలబ్రిటీలు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. గతంలోనే రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా విడాకులు అవుతాయని స్పష్టం చేశారట. ఇక రీసెంట్ గా పెళ్లి చేసుకొని ఎంతో అన్యోన్యంగా ఉన్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు కూడా ఒక మహిళ కారణంగా విడాకులు తీసుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్న లెజ్నోవా కి విడాకులు ఇస్తారని, విడాకులు ఇచ్చి నాలుగో పెళ్లి చేసుకుంటారంటూ చెప్పుకొచ్చారు.

అలాగే రెబల్ స్టార్ ప్రభాస్  కి పెళ్లి జరిగితే ఈ ఏడాది లోనే జరగాలి. ఒకవేళ జరిగినా కూడా  కచ్చితంగా విడాకులు తీసుకుంటారు. ప్రభాస్ కి  ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా పెళ్లి జరగదు. బ్రహ్మచారిగా మిగిలిపోవచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈయన సమంత నాగచైతన్య  విషయంలో చెప్పింది చెప్పినట్లుగా జరగడంతో కొంతమంది ఈయన చెప్పే మాటలు నమ్మితే మరి కొంత మంది కొట్టి పారేస్తున్నారు. అంతేకాదు స్టార్ సెలబ్రిటీల రిలేషన్ గురించి ఇలాంటి నెగిటివ్ కామెంట్లు చేయడంతో చాలామంది వీరి అభిమానులు నీ నోరు ఎప్పుడు శుభాలు పలకదా.. ఎప్పుడు అశుభాలే పలుకుతుందా అంటూ తిట్టిపోస్తున్నారు. అయితే  వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు ఈ సంవత్సరంలో ఎంతవరకు నిజమవుతాయో చూడాలి మరీ.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading