కొత్త సంవత్సరానికి ఘనగా స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్దంగా ఉంది. మరో వారంలో 2023 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి కొత్త ఏడాది 2024లోకి అడుగు పెట్టేస్తాం. ఇలాంటి సమయంలో గడిచిపోయిన సంవత్సరంలే మనం ఏం సాధించాం.. ఏం నష్టపోయాం అనే లెక్కలు వేసుకోవడం సహజం. సినిమా అనేది అందరినీ ఎంటర్టైన్ చేసే విభాగం.. అందుకే ఈ పరిశ్రమ పై ప్రేక్షకుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. దేశంలో ఎన్ని చిత్ర పరిశ్రమలు ఉన్నా ఎక్కువగా బాలీవుడ్ కే ప్రియారిటీ ఇస్తారు.
Advertisement
ఎందుకు అంటే..? అక్కడి సినిమాలకు వందలాది కోట్ల ఆదాయం వస్తుంది. అక్కడ నటించిన వారికే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండేది. మిగిలిన సినీ పరిశ్రమల పేర్లు కూడా అందరికీ తెలిసేవి కావు.. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. బాలీవుడ్ కి పోటీగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతుంది. టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. 2023లో రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో కలెక్షన్ల పరంగా టాప్ 10లో ఉన్న చిత్రాల గురించి తెలుసుకుందాం.
వాల్తేరు వీరయ్య :
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. 2023 సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ము రేపింది. ఇందులో రవితేజ కీ రోల్ లో నటించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.250 కోట్లు నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. టాలీవుడ్ లో మాత్రం రూ.10కోట్లు రాబట్టింది. 2023లో విడుదలైన సినిమాల్లో వాల్తేరు వీరయ్య కలెక్షన్ల పరంగా టాప్ 1 స్థానాన్ని దక్కించుకుంది.
ఆదిపురుష్ :
రామాయణం ఆధారంగా తెరకెక్కిన మూవీ సలార్. ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమా కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.393 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. టాలీవుడ్ లో రూ. 133 కోట్లు రాబట్టింది. టాలీవుడ్ లో వాల్తేరు వీరయ్య కంటే కలెక్షన్లు పరంగా ఆదిపురుష్ వెనుకపడింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ లో ఉన్నా కూడా టాలీవుడ్ లో మాత్రం రెండో స్థానానికి పరిమితం అయింది.
వీరసింహారెడ్డి :
2023 సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది వీరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్దకు ఒకేసారి వచ్చాయి. ఈ రేసులో మెగాస్టార్ పై చేయి సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.134 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. టాలీవుడ్ లో రూ.97 కోట్లు రాబట్టి మూడో స్తానం దక్కించుకుంది.
భగవంత్ కేసరి :
నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ ఏడాదిలో బాలయ్య రెండు హిట్ సినిమాలను అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 115 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కానీ టాలీవుడ్ లో రూ.85 కోట్లు రాబట్టి నాలుగో స్థానం దక్కించుకుంది.
బ్రో :
Advertisement
సాయి ధరమ్ తేజ్ ప్రధాన కథానాయకుడిగా పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం బ్రో. సముద్రఖని దీనికి దర్శకత్వం వహించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.114 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కానీ టాలీవుడ్ లో రూ.82 కోట్లు రాబట్టి ఐదో స్థానం దక్కించుకుంది.
దసరా :
నాని పాన్ ఇండియా హీరోగా దసరా చిత్రంతో పరిచయం అయ్యారు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. కీర్తి సురేష్ ఇందులో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. నానికి ఇది తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఆయన సూపర్ హిట్ అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.118 కోట్లు రాబట్టింది. టాలీవుడ్ లో రూ.76కోట్లు రాబట్టి ఆరో స్థానం దక్కించుకుంది.
జైలర్ :
రజినీకాంత్ హీరోగా నెల్సన్, దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జైలర్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకొని ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మవీ రూ.604 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కానీ టాలీవుడ్ లో రూ.68 కోట్లు సాధించి ఏడో స్థానం దక్కించుకుంది.
బేబీ :
2023లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ప్రేమ కథా చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా యూత్ ను భారీగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.81 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
విరూపాక్ష :
సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు తెరకెక్కించిన మిస్టేక్ థ్రిల్లర్ విరూపాక్ష. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించింది. రెండున్నర గంటల సేపు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని ఇచ్చిన ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కి బిగ్గెస్ట్ ను ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.89కోట్ల కలెక్షన్లు రాబట్టింది. టాలీవుడ్ లో రూ.63 కోట్లు రాబట్టి తొమ్మిదో స్థానం దక్కించుకుంది.
సలార్ :
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్. డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయింది. విడుదలైన మొదటిరోజే ప్రపంచ వ్యాప్తంగా సలార్ ఏకంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. డిసెంబర్ 23 నాటికి టాలీవుడ్ లో రూ.101 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ టాప్ 10 లిస్ట్ లో మూడో స్థానానికి సలార్ చేసుకుంది. సలార్ కలెక్షన్లు క్లోజింగ్ అయ్యేసరికి టాప్ 1 లోకి రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!