తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం వంటి చిత్రాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి సిల్క్ స్మిత ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎక్కువగా వ్యాంప్ పాత్రలు, ఐటెం సాంగ్ లలోనే నటించేది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. ఆమె ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు ప్రాంతానికి చెందిన అమ్మాయి. పేదింటి కుటుంబంలో జన్మించడంతో ఈమె బాల్యమంతా కూడా ఎక్కువగా కష్టాలలోనే గడిపేసిందట. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో నాలుగవ తరగతి వరకే చదువుకుందట. అలాగే చిన్న వయసులోనే వివాహం చేసుకోవడంతో అక్కడ తనకు చాలా ఇబ్బందులు ఎదురవ్వడంతో అత్తమామల ఇంటి నుంచి పారిపోయి చెన్నైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సినిమాల పైన ఆసక్తి ఉండడంతో సిల్క్ స్మిత మొదట మేకప్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలుపెట్టిందట.
ఆ తర్వాత నటి కావాలనే కోరికతో మొదటిసారి 1979లో పండిచక్రం అనే ఒక తమిళ సినిమాతో విజయలక్ష్మి అనే పేరునే కాకుండా తన జీవితాన్ని కూడా మార్చేసి సిల్క్ స్మితగా పెట్టుకున్నది. అలా ఈమె కెరియర్ ఒక్కసారిగా నలుపు తిరిగిపోయింది. ఏకంగా 17 ఏళ్లకే 450కు పైగా సినిమాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. తన అందచందాలతో మెప్పించిన సిల్క్ స్మిత చాలా మంది దర్శక నిర్మాతలు ఈమే తమ సినిమాలలో నటించాలని క్యూ కట్టేవారట. ఎంతలా అంటే ఒక సినిమాలో సిల్క్ స్మిత కొరికిన యాపిల్ పండుని వేలంలో వేయగా కొన్ని లక్షల రూపాయలు వచ్చాయని అప్పట్లో కథనాలు వినిపించాయి. అంతలా సిల్క్ స్మితకి ప్రేక్షకులు సైతం కనెక్ట్ అయిపోయారు.
Advertisement
తన అందంతో యువతను బాగా ఉర్రూతలు ఊగించిన ఈమె ఒకానొక సమయంలో హీరోయిన్ల కంటే ఎక్కువ క్రేజ్ తో పాటు రెమ్యూనరేషన్ ను కూడా డిమాండ్ చేసేదట. ఇలా గ్లామర్ వరల్డ్ లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న సిల్క్ స్మిత అనుకోకుండా ఆమె జీవితం మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. అలా 36 ఏళ్ల వయసుకే మరణించింది సిల్క్ స్మిత. అయితే ఆ తర్వాత నిర్మాణ రంగంలో అడుగుపెట్టడంతో చాలా పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె కృంగిపోయి ఒకవైపు అప్పులు, మరొకవైపు ప్రేమలో విఫలం వల్ల చాలా మానసిక క్షోభకు గురై 1996 సెప్టెంబర్ 23న చెన్నైలో ఉరి వేసుకొని మరణించింది. ఇప్పటికీ సిల్క్ స్మిత మరణం పైన పలు అనుమానాలు వెలువడుతూనే ఉండేది. ఈమెను ఒక స్టార్ హీరో మోసం చేశారనే విషయం కూడా వైరల్ గా మారితూ ఉండేది. ఇటీవల ఈమెకు సంబంధించి ఒక బయోపిక్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!