నాకు నచ్చనిదాన్ని ధ్వంసం చెయ్యడమే నా ప్రవృత్తి” అంటూ జాత్యహంకారంతో మహా మారణహోమం సృష్టించిన వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. నరనరాన జాత్యహంకారం జీర్ణించుకుపోయిన ఈ వ్యక్తి ప్రపంచాన్నే గడగడలాడించాడు. నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ వ్యవస్థాపకుడైన ఈయన, 1933 నుంచి జర్మనీ ఛాన్స్‌లర్‌గానూ, 1934 నుంచి మరణించేదాకా జర్మనీ నేత గా పనిచేశాడు. హిట్లర్ తన వ్యక్తిగత మానిఫెస్టో (ఆత్మకథ) అయిన “మెయిన్ క్యాంప్”ను ప్రచురించాడు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 60 లక్షల మంది యూదు ప్రజల ప్రాణాలను హరించి, చరిత్రలో ఈ జాత్యహంకారి గావించిన మానవ హననం అంతా ఇంతా కాదు. ఇంతటి దారుణాలకు ఒడిగట్టి, కరడుగట్టిన నియంతృత్వ విధానాలను అనుసరించిన హిట్లర్ గురించి ఎవ్వరికీ రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
1. హిట్లర్ ‘ పెళ్ళి ‘ చేసుకోలేదు.
2. హిట్లర్ ఒక ‘ మతం ‘ వారిని దేశ ద్రోహులుగా పరిగణించేవాడు.
3. హిట్లర్ విమర్శను సహించేవాడు కాదు.
4. ఆయన బాల్యంలో పెయింట్, కలర్‌లు అమ్మేవాడు.
5. అన్ని పేపర్లు ఆయనను పొగిడేవి.
Advertisement
6. హిట్లర్ అన్ని కార్మికోద్యమాలను అణిచాడు.
7. తన వ్యతిరేకులను దేశద్రోహులు అనే వాడు.
8. నాజీ పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి అదినేత అయ్యాడు.
9. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని అధికారంలోకి వచ్చాడు.
10. కానీ ఏ సమస్యనూ పరిష్కరించలేదు. జర్మనీ వినాశనం చేశాడు.
11. ” మంచి రోజులు వస్తాయి ” అని చెప్పి అధికారంలోకి వచ్చాడు.
12. హిట్లర్ ఎన్నికైన తర్వాత పార్లమెంటుకు వెళ్ళి రోదించాడు.
13. ” అబద్దాల ” తో అధికారంలోకి వచ్చాడు.
14. అందమైన దుస్తులు దరించి అందంగా ఉండాలని ప్రయత్నం చేశాడు.
15. అబద్దాలను ఒక కళగా అభివృద్ధి చేశాడు.
16. ఆయన ఎప్పుడు, ” నేను ” అని చెప్పేవాడు.
17. రేడియోలో ఎప్పుడూ ప్రసంగం చెయ్యడానికి ఇష్టపడేవాడు.
18. ఆయన తన ప్రేయసిని ” గూడాచారి ”గా ఉపయోగించుకునేవాడు.
19. తన ప్రసంగం ” ఫ్రెండ్స్ ” అని ఆరంభించేవాడు.
20. హిట్లర్ ఫోటోలు దిగడానికి ఇష్టపడేవాడు.
ఈ పోస్ట్ ” హిట్లర్ ” ని ఉద్దేశించి చేయబడింది. మనదేశంలో ఈ లక్షణాలున్న నాయకుడెవరు? అంటూ వాట్సాప్ లలో చక్కర్లు కొడుతోంది. తెగ వైరల్ అవుతుంది.