ఈనెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్ 2023 టోర్నీ కోసం భారత జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది. ఇందులో మొత్తం 17 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. అర్హత కలిగి ఉన్న మరికొంత మంది ప్లేయర్లకు మాత్రం మళ్లీ నిరాశనే మిగిలింది. ఇంతకు అర్హత ఉండి కూడా ఆసియా కప్ కోసం సెలెక్ట్ కానీ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
శిఖర్ ధావన్ :
టీమిండియా ఓపెనర్ ధావన్ ఒకప్పుడు ప్రత్యర్థులపై విరుచుకుపడిన కీలక ఆటగాడు. రోజు రోజుకు ఆటలోకి యువ ఆటగాళ్లు వస్తుండటంతో సెలెక్టర్లు ధావన్ కి మొండి చేయి చూపిస్తున్నారు. ఆసియా క్రీడల కోసం వెళ్లే భారత్ బీ జట్టులో ధాన్ ని కెప్టెన్ గా నియమిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. అందులో తనికి కాస్త నిరాశనే మిగిలింది. ఆసియా కప్ కోసం అయినా ధావన్ కి అవకాశం వస్తుందని అనుకున్నారు అందరూ. కానీ అలా జరుగలేదు. ఐసీసీ టోర్నీలోనే 6 సెంచరీలు చేసిన ఘనత శిఖర్ ధావన్ సొంతం అయినా అతనికి అవకాశాలు దక్కలేదు.
భువనేశ్వర్ కుమార్ :
విషయానికొస్తే.. ప్రతిభ ఉన్న అతనికి ప్రతిఫలం దక్కడం లేదు. ఐపీఎల్ లో రాణిస్తున్నప్పటికీ భారత జట్టులోకి అతడినీ తీసుకోవడం లేదు. 121 వన్డేలలో 141 వికెట్లు పడగొట్టిన ఈ స్వింగ్ కింగ్ కి ఆసియా కప్ కోసం అవకాశం లభించకపోవడం చాలా ఆశ్చర్యకరమనే చెప్పాలి. భువనేశ్వర్ ని ఎంపిక చేయకపోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
యుజ్వేంద్ర చాహల్ :
Advertisement
ప్రస్తుతం భారత్ తరుపున విజయవంతంగా రాణిస్తున్న చాహల్ కి ఆసియా కప్ ఆడే టీమిండియాలో చోటు దక్కలేదు. 72 వన్డేలలో 121 వికెట్లు పడగొట్టిన చాహల్ ఎలాంటి బ్యాటర్ ని అయినా ఇబ్బంది పెట్టగల స్పిన్నర్ అనే చెప్పాలి.
రవిచంద్రన్ అశ్విన్ :
భారత్ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కి కూడా ఆసియా కప్ లో నిరాశ తప్పలేదు. ఫార్మాట్ ఏదైనా తనదైన బౌలింగ్ తో ప్రత్యర్థిని పడగొట్టే అశ్విన్ కి ఇటీవల జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో కూడా నిరాశే మిగిల్చింది. అశ్విన్ కి ప్రపంచ కప్ టోర్నీలో ఆడేందుకు అవకాశాలు మిగిలే ఉన్నాయన్నట్టు రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
సంజూ శామ్సన్ :
ఇటీవలే సంజూ శామ్సన్ టీ-20 క్రికెట్ లో అవకాశాన్ని అందుకొని పర్వాలేదనిపించాడు. సంజూ ఆడిన 13 వన్డేలలో 390 పరుగులు చేశాడు. ఆసియా కప్ కోసం మాత్రం ఎంపిక కాలేదు.
ఆసియా కప్ కోసం ఎంపికైన భారత్ జట్టు :
రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కే.ఎల్.రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ప్రసిద్ద్ కృష్ణ ఎంపికయ్యారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
World Cup 2023 : హైదరాబాద్ లో పాకిస్తాన్ మ్యాచ్ డేంజర్ అంటున్న పోలీసులు..!
Asia Cup 2023 : టీమ్ ఇండియా ప్రకటన.. తిలక్ ఎంట్రీ.. వైస్ కెప్టెన్ గా హర్దిక్..!