Home » ఈ సినిమాలన్ని ప్రేక్షకులను ఫూల్స్ చేశాయి.. రజినీకాంత్, ప్రభాస్ తో సహా..!

ఈ సినిమాలన్ని ప్రేక్షకులను ఫూల్స్ చేశాయి.. రజినీకాంత్, ప్రభాస్ తో సహా..!

by Anji
Ad

సాధారణంగా కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరిస్తే, మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను గందరగోళంలో పడేస్తాయి. సినిమాలో మనల్ని ఇన్వాల్వ్ చేసి నిజం అని నమ్మించి, ఆ తర్వాత అదంతా అబద్ధమని చెబుతారు. అప్పటివరకు ఇంట్రెస్టింగ్ గా చూసిన ప్రేక్షకుడు ఏంటి ఇది నిజం కాదా అన్నట్టు ముఖం పెడతాడు. అలాంటి సినిమాలు అన్ని భాషల్లోనూ వస్తాయి. అలాంటి కొన్ని సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లియో సినిమా ప్రేక్షకులను కన్ ప్యూజ్ చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా విడుదల అవ్వగా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా కలెక్షన్లను రాబట్టలేదు.

 


తెలుగులో ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోగా, ఈ సినిమాలో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా నిజం కాదు అని ఒక రూమర్ వినిపిస్తుంది. అసలు విషయం దాచిపెట్టినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన పిజ్జా సినిమా 2012లో విడుదలైంది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఫూల్స్ చేసిందని చెప్పవచ్చు. అప్పటివరకు జరిగిందంతా అబద్ధం అని చెప్పేసరికి ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ కు గురవుతారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమా కూడా ప్రేక్షకులను ఫూల్స్ చేస్తుంది. ఇందులో మహేష్ బాబు తల్లిదండ్రులను చంపిన క్యారెక్టర్ గురించి అబద్ధం చెప్పి నమ్మిస్తారు. క్లైమాక్స్ లో అసలు నిజం చేస్తారు.

Advertisement

Advertisement

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా డార్లింగ్ కూడా అదే కోవకు చెందినది. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ లో జరిగిందంతా అబద్ధమని హీరో చెప్పేసరికి ప్రేక్షకులు కంగుతింటారు. ఇక యంగ్ హీరో అడవి శేష్ నటించిన ఎవరు సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో అడవి శేష్ ఫ్లాష్ బ్యాక్ ని వేరే అతనిదిగా చూపించి ఆడియన్స్ ని ఫూల్స్ ని చేశారు. ఇక రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమా ప్రేక్షకులను కన్ ఫ్యూజ్ చేస్తుంది. ఈ సినిమాలో జైల్ లో ఉండి రవితేజ చెప్పే కథంతా కూడా ఫేక్ అని ఆ తర్వాత తెలుస్తుంది. ఇక రజనీకాంత్ హీరోగా వచ్చిన పేట సినిమాలో విలన్ గా నటించిన విజయ్ సేతుపతికి రజినీకాంత్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెబుతాడు. చివరికి ఇది బూటకమని తెలుస్తుంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి!    తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading