ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం చేశారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ ప్రసంగంలో ముఖ్య అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
విజయవాడలో 206 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం..సాంఘిక న్యాయం సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది..పేదపిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం..నవరత్నాల హామీలను మా ప్రభుత్వం అమలుచేసింది.. ప్రతి ఒక్కరికి ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం..విద్య కోసం 73వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టింది.. జగనన్న అమ్మ ఒడి పథకం కింద 15వేలు నేరుగా తల్లుల ఖాతాల్లో జమచేస్తోంది..దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం.
Advertisement
మాది పేదల పక్షపాత ప్రభుత్వం..పేదరికం 11.25 శాతం నుంచి 4.1శాతానికి తగ్గింది..జగనన్న గోరుముద్ద కింద నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం అమలుచేశాం.. 43లక్షలమందికి పైగా జగనన్న గోరుముద్ద పథకం..ఏడాదికి 4,416 కోట్లు ఖర్చుచేశాం..విద్యా కానుక కింద విద్యార్థులకు యూనిఫాం సహా బుక్స్..విద్యాకానుకకు 3,367 కోట్లు ఖర్చు చేశాం..ఐటీఐ, ఇంజనీరింగ్..11వేల కోట్లకు పైగా రీయింబర్స్ చేశాం’ అని ప్రభుత్వం అమలు పరిచిన పథకాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరిస్తూ పలు అంశాలు ప్రసంగించారు.