సినీ ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ప్రేమలో పడటం సర్వసాధారణమనే చెప్పాలి. కొందరూ సెలబ్రిటీలు ప్రేమలో పడి వారినే పెళ్లి చేసుకున్న వారు ప్రస్తుతం కొంత మంది చాలా సంతోషంగా ఉండగా.. మరికొందర మాత్రం విడాకులు తీసుకొని విడిపోయారు. చాలా మంది హీరో, హీరోయిన్లు తమ కో స్టార్స్ తో ప్రేమలో పడి వారినే పెళ్లి చేసుకుని ప్రస్తుతం జీవితంలో గడుపుతున్నారు. సౌత్ ఇండస్ట్రీలో కో స్టార్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నటీ, నటుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
నాగార్జున-అమల :
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ.. తన కోస్టార్ అమల ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే నాగార్జునకు ఇది రెండో వివాహం కావటం గమనార్హం. వీరిద్దరూ రెండు సినిమాలలో కలిసి నటించారు. ఇదే సమయంలోనే ప్రేమలో పడి పెద్దల సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు.
మహేష్ బాబు – నమ్రత :
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రతలది కూడా ప్రేమ వివాహమే. వీరిద్దరూ కలిసి వంశీ సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. అనంతరం పెళ్లి చేసుకుని ఇప్పటికిీ తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
సూర్య-జ్యోతిక :
టాలీవుడ్ స్టార్ హీరో సూర్య సినీ నటి జ్యోతిక ఇద్దరిది కూడా ప్రేమ వివాహం అనే సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించారు. సూర్య-జ్యోతికలు కుటుంబ సభ్యులకు తెలియకుండానే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత సూర్య తండ్రి వీరి ప్రేమ పెళ్లిని అంగీకరించి.. తిరిగి మరోసారి వీరిద్దరికి ఘనంగా పెళ్లి చేశారు.
Advertisement
ప్రసన్న-స్నేహ :
తెలుగు హీరోయిన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు స్నేహ . ఈమె కోలీవుడ్ నటుడు ప్రసన్ తో కలిసి పలు తమిళ సినిమాలలో నటించారు. ఈ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడటం.. అనంతరం ప్రజల సమక్షంలో వీరిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది.
అజిత్ – షాలిని :
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు అజిత్ ఒకరు. ఈయన వరుస సినిమాలలో నటిస్తే కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈయన నటి శాలినితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ఇలా వీరిద్దరూ సినిమాలలో నటిస్తూనే ప్రేమలో పడటం.. అనంతరం పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత షాలిని పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు.
యష్-రాధిక :
కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ మూవీ ద్వారా రాఖీ బాయ్ గా గుర్తింపు పొందారు. ఇలా ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి ఈయన తన సహ నటి రాధిక పండిట్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత రాధిక సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. వీరే కాదు.. సౌత్ ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది ఉన్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!