Home » Chanakya Niti : విజయాన్ని అడ్డుకునే దుష్ట శక్తులు ఇవే.. వెంటనే వదిలించుకోండి..!

Chanakya Niti : విజయాన్ని అడ్డుకునే దుష్ట శక్తులు ఇవే.. వెంటనే వదిలించుకోండి..!

by Anji
Ad

ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన పలు విషయాలను చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా వ్యక్తి తన జీవితాన్ని సక్సెస్ ఫుల్ గా హ్యాపీగా రాణిస్తారు. వ్యక్తి విజయాన్ని అడ్డుకునే కొన్ని తప్పులు, దురలవాట్లు ఉన్నాయి. దురలవాట్లను వదిలివేసి మీరు సక్సెస్ సాధించాలంటే ఈ పొరపాట్లు చేయకుండా ఉండాలి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

సమయం విలువ : 

సమయానికి విలువ ఇవ్వని వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. ఆచార్య చాణక్యుడి ప్రకారం.. వివేకవంతమైన వ్యక్తి సమయాన్ని గౌరవిస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే.. ఆ సమయమే మీకు మంచి సక్సెస్ అందిస్తుంది. 

చెడు వ్యసనం :

మద్యపానం, జూదం, బెట్టింగ్, దొంగతనం అబద్దాలు చెప్పడం వంటి దురలవాట్లు ఉన్న వ్యక్తులు ఎప్పటికీ తమ జీవితంలో సక్సెస్ అవ్వలేరు. చాణక్యుని విధానం ప్రకారం.. మనిషి ఎప్పుడూ ఇలాంటి వ్యసనాలకు, చెడు ఆలోచన విధానాలకు దూరంగా ఉండాలి. 

డబ్బు విలువ : 

Advertisement

Manam News

డబ్బును పట్టించుకొని ఆలోచించకుండా ఖర్చు చేసే వారిపై లక్ష్మీదేవిపై చాలా ఆగ్రహంగా ఉంటుంది. తద్వారా వారు పేదరికంలో మగ్గుతుంటారు. అందుకే మనిషి ఎప్పుడూ డబ్బు విలువను అర్థం చేసుకొని మసులుకోవాలి. 

దురాశ : 

అత్యాశగల వ్యక్తి జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. ఎంత ఎక్కువ తీసుకుంటే అంత తక్కువ ఆస్వాధిస్తాడు. అత్యాశకు బదులు శ్రమను ఎప్పుడూ నమ్మాలని చాణక్యనీతి చెబుతోంది. 

అవమానం : 

స్త్రీలను, పెద్దలను అవమానించడం. ఎవరైనా సరే స్త్రీలను,పెద్దలను అస్సలు అవమానించకూడదు. ఇతరులను గౌరవించని వారి వద్ద లక్ష్మీదేవి అస్సలు నిలవదు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Chanakya Niti : వీరు విజయం సాధించేందుకు ఉపయోగపడే లక్షణాలు ఇవే..!

Chanakya niti:పెళ్ళైన పురుషులు పరాయి స్త్రీని ఇష్టపడటానికి 5 కారణాలు..!!

Visitors Are Also Reading