సాధారణంగా సెలబ్రిటీలు ఎప్పుడు ఎవ్వరూ ప్రేమించుకుంటారో అస్సలు తెలియదు. ఎప్పుడు ఎవ్వరూ పెళ్లి చేసుకుంటారో కూడా తెలియదు. అలా అని ఎప్పుడు విడిపోతారో కూడా తెలియని సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రేమించుకోవడం, నిశ్చితార్థం చేసుకోవడం ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కకుండానే విడిపోవడం లాంటివి మనం ఎక్కువగానే చూస్తున్నాము. ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీలు కూడా ప్రేమించుకొని నిశ్చితార్థం కూడా చేసుకొని.. ఆ తర్వాత తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకుంటున్నారు. మరి ప్రేమించుకుని నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి చేసుకోకుండానే విడిపోయిన జంటల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
రక్షిత్ శెట్టి – రష్మిక :
కన్నడ సినీ నటులు రక్షిత్ శెట్టి , రష్మిక ఇద్దరు కూడా కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి ఎంతో ఘనంగా 2018 లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత రష్మికకు సినిమా అవకాశాలు రావడంతో.. నిశ్చితార్ధాన్ని బ్రేకప్ చేసుకొని కెరీర్ పరంగా ఇద్దరూ సినిమాలలో బిజీ అయిపోయారు.
అఖిల్-శ్రీయాభూపాల్ :
అక్కినేని నాగార్జున వారసుడిగా అఖిల్ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఈయన ప్రముఖ డిజైనర్ శ్రియా భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించారు. కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి మరి 2016 లో నిశ్చితార్థం చేసుకున్నారు. సమంత , నాగచైతన్య , అఖిల్, శ్రియ భూపాల్ నిశ్చితార్థపు వేడుకలు ఒకేసారి జరిగాయి. తర్వాత కొంతకాలానికి అఖిల్ , శ్రీయ భూపాల్ తమ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. శ్రియా భూపాల్ మాత్రం వివాహం చేసుకొని సెటిల్ అవ్వగా.. అఖిల్ మాత్రం ఇంకా బ్యాచిలర్ గానే కొనసాగుతున్నారు.
త్రిష – వరుణ్ మ్యానియన్ :
Advertisement
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష బిజినెస్ మాన్ అయిన వరుణ్ మ్యానియన్ తో 2019 లో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి డేట్ కూడా ప్రకటించిన తరువాత ఈ జంట ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయి.. అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు.
విశాల్-అనీషా రెడ్డి :
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష బిజినెస్ మాన్ అయిన వరుణ్ మ్యానియన్ తో 2019 లో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి డేట్ కూడా ప్రకటించిన ఈ జంట ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయి.. అందరికీ షాక్ ఇచ్చారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!