నైరుతి రుతుపవనాల పలు కారణంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణ రాష్ట్రంలో వర్షం ముందపు పొంచే ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సోమ, మంగళ, బుధవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఉన్న మేఘాల ఉధృతి నమూనాలను పరిశీలించిన అధికారులు పలు ప్రాంతాల్లో 35 సెంటిమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపారు.
ప్రధానంగా ఒడిశా, ఉత్తరాంద్ర మీదుగా రాష్ట్రంపై దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయన్నారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు మరింత భారీగా పడే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు పలు ప్రాంతాల్లో ముసురుపట్టి మూడు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణలో 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామంలో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టర్ మాస్టర్ బోర ఆదిలక్ష్మీ విద్యుదాఘాతంతో మృతి చెందారు.
Advertisement
Advertisement
తొలి ఏకాదశి పుణ్య స్నానాల కోసం వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన 25 మంది భక్తులు బస్సులో కాళేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా వారి వాహనం వరదలో చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న అధికారులు పొక్లెయిన్ సాయంతో బస్సును బయటకు లాగారు. రాష్ట్రంలో పలుచోట్ల వాగులు పొంగడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాంతంలోనే జులైలో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఈ రెండు, మూడు రోజులు అత్యధిక వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
Also Read :
పురుషులు ఎక్కువగా గూగుల్ లో వెతికే విషయాలు ఇవేనేట…!
ఆషాఢమాసం లో అత్త కోడళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదు అంటారు ! దానికి కారణాలు ఏంటి ?