చిత్రం : ది వారియర్
నటీనటులు : హీరో రామ్ పోతినేని, హీరోయిన్ కృతి శెట్టి, ఆది పినిశెట్టి, నదియా, అక్షర గౌడ.
నిర్మాత :శ్రీనివాస్ చిట్టూరి
దర్శకత్వం :ఎన్.లింగుస్వామి
మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటర్: నవీన్ నూలీ
రిలీజ్ డేట్:14 జులై 2022
భాషలు : తెలుగు, తమిళం
దర్శకుడు లింగుస్వామి మొదటిసారి తెలుగులో తీసిన చిత్రం “ది వారియర్”. రామ్ పోతినేని హీరోగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. రామ్ సరసన హీరోయిన్ కృతి శెట్టి నటించింది. ఇందులో ఆమె పాత్ర రేడియో జాకీ. ఇప్పటికే హీరో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ మూవీ తో తన టాలెంట్ నిరూపించుకున్నారు. మళ్లీ అదే తరహాలో యాక్షన్ త్రిల్లింగ్ తో ది వారియర్ మూవీ థియేటర్ లోకి వచ్చింది. తెలుగు తమిళంలో జూలై 14వ తేదీన వీడియో సినిమా విడుదలైంది. మరి ఈ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం..
కథ :
రామ్ పోతినేని, కృతి శెట్టి కాంబినేషన్లో వచ్చిన మూవీ ది వారియర్. ఇందులో విలన్ గా ఆది పినిశెట్టి ప్రత్యేకం. మూవీ తెలుగు మరియు తమిళ భాషల్లో రిలీజ్ అయింది. ఈ మూవీపై ఎప్పటినుంచి అభిమానులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇది రాము సినీ జీవితంలోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన మొదటి సినిమా. ఈ మూవీకి మిక్సడ్ టాక్ వస్తోంది. ఫస్టాఫ్ బాగానే ఉందని, సెకండాఫ్లో ల్యాగ్ ఎక్కువైందని, ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే రొటీన్ గా ముగిసింది అని చెబుతున్నారు. కామెడీ, డైలాగ్స్ లో హీరో రామ్ పోతినేని అదరగొట్టారని, రామ్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడ్డట్టే అని అంటున్నారు.
Advertisement
Advertisement
ప్లస్: సినిమాలో నటించిన వారంతా వారి పాత్రలకు న్యాయం చేశారు. సెకండాఫ్ ఊర మాస్ గా సాగుతుంది.
మైనస్: రామ్ పోతినేని,ఆది మధ్య సీన్స్ ఇంకా డిజైన్ చేసుకునే అవకాశం ఉన్న దర్శకుడు తడబడ్డాడు.
రేటింగ్:3.5/5
ALSO READ:
- అల్లుఅర్జున్ మరో రికార్డు.. పుష్పతో ఫస్ట్ ఇండియన్ హీరోగా ఘనత
- సమంతకు కౌంటర్ ఇచ్చిన నాగ చైతన్య..!