Home » మళ్లీ పెళ్లి పై నవదీప్ వీడియో షేర్.. సోషల్ మీడియాలో వైరల్..!

మళ్లీ పెళ్లి పై నవదీప్ వీడియో షేర్.. సోషల్ మీడియాలో వైరల్..!

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో యువ హీరో నవదీప్ కూడా ఒకరు. జై సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నవదీప్ కెరీర్ మొదట్లో చాలా వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. చందమామ వంటి సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు నవదీప్. ఆ తర్వాత గౌతమ్ ఎస్ఎస్సి వంటి చిత్రాలలో నటించినప్పటికీ ఆయన చేసిన ప్రయోగాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. అనంతరం రూటు మార్చి పెద్ద సినిమాలలో సైడ్ రోల్స్ చేస్తూ ముందుకు సాగారు.

Advertisement

ఆర్య 2, ధృవ, అల వైకుంఠపురంలో, నేనే రాజు నేనే మంత్రి వంటి సూపర్ హిట్ చిత్రాలలో కనిపించారు.  అయితే ఈ ఏడాది  న్యూ **సెన్స్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నవదీప్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా పెళ్లిపై నవదీప్ షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో నవదీప్ మాట్లాడుతూ.. ఇటీవల మా అమ్మగారు నాకు ఒక ప్రశ్న వేశారు. అది ఏంటంటే.. నిజంగా పెళ్లిళ్లు అంత బ్యాడ్ అయితే విడాకులు తీసుకున్న వాళ్లు మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు..? అని ప్రశ్నించిందట.

Advertisement

ఇదే ప్రశ్నపై వీడియోలో నవదీప్ మాట్లాడుతూ.. ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదన్నారు. అంతేకాదు ఆ వీడియోకి “జరగాలి పెళ్లి” అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా ఆడ్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏంటన్నా పెళ్లికి రెడీ అవుతున్నావా.? అని కొందరు కామెంట్స్ చేస్తే.. కొందరేమో మీ పెళ్లికి మిమ్మల్ని కచ్చితంగా పిలవండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని బట్టి చూస్తే నవదీప్ కూడా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారని చెప్పవచ్చు.

 

Visitors Are Also Reading