అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా 2016లో విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజు ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ తరువాత బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది ఈ చిత్రం. నాగార్జున, నాగచైతన్య కెరీర్‌లో బంగార్రాజు చిత్రం హిట్‌గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయనా సినిమా క్రేజ్ కూడా బంగార్రాజు చిత్రానికి బాగా కలిసొచ్చిందనే చెప్పవచ్చు.
Advertisement
ముఖ్యంగా ఈ చిత్రంలో నాగార్జున బంగార్రాజుగా, రాముగా ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నారు. అదేవిధంగా బంగార్రాజు మనవడిగా నాగ చైతన్య అద్భుతంగా నటించారు. నాగచైతన్యనకు జోడీగా ఈ చిత్రంలో కృతిశెట్టి నటించింది. సర్పంచ్ నాగలక్ష్మీగా లంగావోని చీరలో కృతి శెట్టి ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకోగలిగింది. కృతిశెట్టికి ఉప్పెన, శ్యామ్‌సింగరాయ్ హిట్ తరువాత బంగార్రాజు సినిమా హ్యాట్రిక్ కావడం విశేషం.
Advertisement
అయితే బంగార్రాజు కోసం తొలుత మరొక స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని చిత్ర బృందం అనుకున్నారట. కానీ చివరకు కృతిశెట్టిని ఫైనల్ చేసింది చిత్ర యూనిట్. తొలుత ఉప్పెన సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో చిత్ర నిర్వాహకులు కృతిశెట్టిని సంప్రదించారట. అయితే అప్పటికే కృతి రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తేదీలు అడ్జెస్ట్ అవుతాయో లేదో అని.. నో చెప్పారట. దీంతో బంగార్రాజు చిత్ర నిర్వాహకులు రష్మిక మందన్నను తీసుకోవాలని ప్రయత్నాలు కూడా ప్రారంభించారట. చివరికీ డేట్స్ అడ్జెస్ట్ చేస్తామని కృతిశెట్టి టీమ్ వెనక్కి రావడంతో బంగార్రాజు చిత్రానికి కృతిశెట్టిని ఫైనల్ చేసారట.