ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పవచ్చు. ఆయన కారు బోల్తా పడి చివరికి మంటల్లో చిక్కుకుంది.. కానీ ఆయనను ఆ ఒక్క వ్యక్తి సాహసం చేసి మరీ బయటకు తీసి కాపాడారు. మరి ఆయన ఎవరు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. ఓ చిరు ఉద్యోగి రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడారట. శుక్రవారం ఉదయం పూట కారు బోల్తా పడింది.. కారులో రిషబ్ పంత్ తీవ్రంగా గాయాల పాలయ్యారు.. యాక్సిడెంట్ జరిగిన తర్వాత కారు పరిస్థితి చూస్తే ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. ఏ ఆనవాళ్లు లేకుండా కారు 70% కాలి బూడిదయింది.
Advertisement
also read;టీ-20లలో 70 సిక్సర్లు.. 70 బంతుల్లోనే మ్యాచ్ ముగించిన ఆటగాడు ఎవరో తెలుసా ?
ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలకి తీవ్రమైన గాయమైంది. ఆ కారు బలంగా డివైడర్ ను ఢీ కొట్టడంతో అతని వెన్నెముక, కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. రూూర్కి సమీపంలోని మహమ్మదాపూర్ జాట్ ప్రాంతంలో పంత్ కారు ప్రమాదానికి గురైంది. తీవ్రమైన మంటల్లో కాలిపోతున్న కారులోంచి ప్రాణాలకు తెగించి పంత్ ని కాపాడింది ఒక బస్సు డ్రైవర్. రిషబ్ పంత్ పట్ల ఆ బస్సు డ్రైవర్ దైవదూతగా మారారని చెప్పవచ్చు. ఆ డ్రైవర్ ముందుగా బస్సును ఆపి రిషబ్ పంత్ ను కారులోంచి బయటకు తీశారు .. వెంటనే అతగాడిని ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో తాను హరిద్వార్ వైపు వస్తున్నట్లుగా బస్సు డ్రైవర్ సుశీల్ తెలియజేశారు.
Advertisement
అయితే పంత్ ప్రయాణిస్తున్న కారు ఢిల్లీ వైపు నుంచి వస్తోందని చెప్పారు. ఆయన డివైడర్ ను ఢీకొని దాదాపు 200 మీటర్లు దూసుకెళ్లిందని అన్నారు. అది చూసిన వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపేసి ప్రమాదం జరిగిన కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లానని చెప్పారు. అప్పటికే కారు పల్టీలు కొట్టింది. పంతు కారు విండో నుంచి సగం బయటకు వచ్చారు. తను ఒక క్రికెటర్ నని పంత్ చెప్పారు. కానీ ఆ డ్రైవర్ నేను క్రికెట్ ని చూడను.అందుకే ఆయనను గుర్తుపట్టలేకపోయాను అని చెప్పేసారు. కానీ బస్సులో ఉన్నవారు అతన్ని గుర్తుపట్టారని వెంటనే బయటకు లాగి, కారులో ఇంకెవరైనా ఉన్నారేమో చూసి, అతడి నీలం రంగు బ్యాగ్ లో 7వేల రూపాయలను గుర్తించామని తెలియజేశారు. ఈ డబ్బును అంబులెన్స్ డ్రైవర్ కు సుశీల్ అప్పజెప్పారట. అతని ఒంటిపై బట్టలు చిరిగిపోయి ఉండడంతో బస్సు లో ఉన్న షీట్ లో చుట్టి అంబులెన్స్ లో ఎక్కించినట్టు ఆయన తెలియజేశారు.