Home »  చెల్లి పెళ్లికి అన్న.. చనిపోయిన తండ్రిని తీసుకొచ్చాడు.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు పెడతారు..?

 చెల్లి పెళ్లికి అన్న.. చనిపోయిన తండ్రిని తీసుకొచ్చాడు.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు పెడతారు..?

by Sravanthi
Ad

లక్షలు ఖర్చు పెట్టారు ఖరీదైన కళ్యాణ మండపం ఆర్డర్ చేశారు. రకరకాల భోజనాలు, దగదగ మెరిసే పూల అలంకరణలు, ఎటు చూసినా కెమెరాలు బంధుమిత్రులు సందడి, సందడిగా సాగుతున్న పెళ్లి. ఇక పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు రెడీగా ఉన్నారు.. ముహూర్తం దగ్గరికి వస్తోంది.. ఇంతలోనే పంతులు పెళ్లికూతురును, పెళ్లి కొడుకును పీటలమీద కూర్చోవాలని అనౌన్స్ చేశారు. ఇంతలోనే ఒక్కసారిగా బంధుమిత్రులు అంతా ఆశ్చర్యపోతూ.. కన్నీరు పెట్టుకుంటున్నారు.. ఏం జరిగిందో దూరంగా చూస్తున్న వారికి అర్థం కావడం లేదు.. ఒకరిపై ఒకరు పడి ఏడుస్తున్నారు.. మండపం అంతా కన్నీళ్ళతో నిండిపోయింది.. అసలా మండపంలో ఏం జరిగింది.. వచ్చిన వారంతా ఎందుకు ఏడుస్తున్నారు.. ఓ సారి తెలుసుకోండి..?

ఎన్నో ఆస్తులు సంపాదించాడు. పిల్లలను అల్లారు ముద్దుగా పెంచాడు.. పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరుగుతోంది. పెళ్లి కూతురు నగలు ఖరీదైన, దుస్తులు ధరించి మండపం లోకి వస్తోంది. కానీ పెళ్లికూతురులో ఆమె కుటుంబసభ్యుల్లో ఏదో తెలియని వెలతి.. అందరూ ఉన్నారు.. అంత సంపాదించి పెట్టిన తండ్రి ఇటీవలే చనిపోయాడు. దీంతో పెళ్లి కూతురు తన తండ్రి లేడనే ఆవేదన చెందుతోంది. అన్నీ ముందుండి చూసుకున్నా అన్న, తన చెల్లి పెళ్లికి తండ్రిని ఎలాగైనా చూపించాలి అనుకున్నాడు. చనిపోయిన తండ్రి గుర్తును తన కుమారుడు మళ్ళీ సృష్టించాడు. మైనంతో తన నాన్న విగ్రహాన్ని అచ్చుగుద్దినట్టు తయారు చేయించారు. మొత్తం వాళ్ళ నాన్న తిరిగి వచ్చినట్టు ఆ రూపం కనబడుతోంది..

Advertisement

Advertisement

ఆ రూపాన్ని రూపొందించినట్టు ఎవరికి కూడా తెలియదు. ఈ విధంగా ప్లాన్ చేసి, చెల్లి పెళ్లికి నాన్న లేని లోటు తీర్చాలని సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాడు. చెల్లి పెళ్లి మండపంలో కూర్చోడానికి వచ్చే సమయంలో నాన్న ఎంట్రీ ని చూసి నమ్మలేక పోయారు . ఆయన రూపాన్ని చూడగానే ఆయన భార్యకు కన్నీళ్లు ఉబికి వచ్చాయి. పెళ్లి కూతురు నాన్న రూపాన్ని చూసి దీంతో ఎమోషనల్ అయింది. నాన్నను హత్తుకొని బోరుమంది. తనివితీరా ముద్దాడింది. అక్కడికి వచ్చిన బంధుమిత్రులు కూడా ఆ మైనపు విగ్రహాన్ని చూసి పట్టుకుని ఏడ్చారు.. చెల్లి పెళ్లి లో తండ్రి లేడనే బాధను తీర్చిన అన్నను చూసి అక్కడున్నవారంతా పొగడ్తలతో ముంచెత్తారు. దీన్ని అక్కడున్న వారెవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

also read;

ఉదయకిరణ్ తో తీయాలనుకున్న ‘సై’ సినిమాలో రాజమౌళి ఎందుకు హీరోను మార్చాడు..?

virataparvam real story:విరాటపర్వంలో ఓరుగల్లు బిడ్డ సరళ కన్నీటి గాథ..అసలు కథ తెలిస్తే కన్నీరు పెడతారు..?

 

Visitors Are Also Reading