Home » అంత అందం ఉన్నా.. బాలయ్య కూతుర్లు హీరోయిన్స్ కాలేకపోయారు ?

అంత అందం ఉన్నా.. బాలయ్య కూతుర్లు హీరోయిన్స్ కాలేకపోయారు ?

by Bunty
Ad

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో కళామతల్లి ముద్దుబిడ్డగా పేరు పొందారు. థియేటర్లలో ఆయన సినిమా చూస్తున్నంత సేపు అరుపులతో కేక పెట్టిస్తారు. ఆయన డైలాగులు చెబుతున్నంతసేపు ప్రేక్షకులు మైమరిచిపోతారు. ఆయన ఒక లెజెండ్. బాలయ్య నటించిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. తాజాగా, ఆయన నటించిన వీరసింహారెడ్డి సినిమా బంపర్ హిట్ అయింది. అయితే బాలకృష్ణ తన కుటుంబంలో ఎంతో మందిని హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

Advertisement

కానీ తన కూతుర్లను మాత్రం ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. హీరోయిన్లను మించిన అందం బాలయ్య కూతుర్లది. అందం, అభినయం ఉన్నప్పటికీ వారు కూడా సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపించలేదట. బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి సినిమాలలో నటిస్తే ఎక్స్పోజింగ్ పాత్రలు కచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఆమెకు ట్రెడిషనల్ పాత్రల్లో నటించడం అంటే చాలా ఇష్టమట. కానీ సినిమాలలో కచ్చితంగా ఎక్స్పోజింగ్ చేయాల్సి ఉంటుంది. తనకు ఎక్స్పోజింగ్ చేయడం అంటే అసలు ఇష్టం లేదట. ఆ కారణంతోనే ఇండస్ట్రీ వైపు రాలేదట.

Advertisement

ఇక బాలయ్య చిన్న కూతురు తేజస్వినికి కూడా సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉండదట. అంతేకాకుండా అంతటి స్టార్ హీరోల కూతుర్లు హీరోల సరసన నటిస్తే బాలకృష్ణ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తారని బాలయ్య బాబు కూడా వారిని సినిమాల్లోకి తీసుకురావడానికి ఇష్టపడలేదట. అంతేకాకుండా ఎంతోమంది తన కూతుళ్ళకి ఆఫర్స్ ఇచ్చినప్పటికీ… వారికి ఇష్టం లేదు కాబట్టి సినిమాలలో నటించమని ఇబ్బంది పెట్టలేదట. ఇక బాలకృష్ణ ఇద్దరు కూతుర్లు పలు బిజినెస్ లు చూసుకుంటూ, కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

YS Bharti Reddy : భారతిరెడ్డి చేతికి గాయం.. కారణమేంటి.?

తమన్నా, కోహ్లీ పర్సనల్ వీడియోలీక్.. షాక్ లో అనుష్క ?

పూరి జగన్నాథ్ తమ్ముడు ఎమ్మెల్యే అనే విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading