Home » ఆ రోజుల్లోనే 10 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన మెగాస్టార్ మూవీ ఏంటంటే..!!

ఆ రోజుల్లోనే 10 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన మెగాస్టార్ మూవీ ఏంటంటే..!!

by Sravanthi
Ad

మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే అభిమానుల్లో ఏదో తెలియని ఉత్సాహం ఉరకలు వేస్తుంది.. ఆ రోజుల్లో స్టెప్పులు అంటే మెగా స్టార్ మెగా స్టార్ అంటే స్టెప్పులు అనే విధంగా పేరు తెచ్చుకున్నాడు.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఆయనను అభిమానించని వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఆ రోజుల్లో చిరంజీవి సినిమా వచ్చిందంటే చాలు థియేటర్ మొత్తం హౌస్ఫుల్ బోర్డ్ లతో ఈలలతో మార్మోగిపోయేదట.

అంతటి క్రేజ్ ఉన్న చిరంజీవి ఆ రోజుల్లోనే పలు రకాల రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు..’ ఘరానా మొగుడు’ సినిమాతో ఘన విజయం సాధించి రికార్డు సృష్టించారు.. దీన్ని కన్నడ చిత్రం “అనురాగ అరళితు” ఆధారంగా తెలుగులో రూపొందించారు. ఈ సినిమా అప్పటికి ఇప్పటికి తిరుగులేని సంచలనం చెప్పవచ్చు. అలాగే డిస్కో శాంతీలతో రూపొందించినటువంటి బంగారు కోడిపెట్ట పాట ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిన విషయమే.

Advertisement

Advertisement

ఇందులో హీరోయిన్ నగ్మా,వాణి విశ్వనాథ్ తన అందచందాలు దర్శకేంద్రుడి మాయాజాలంతో జలపాతం లాంటి కీరవాణి సంగీతం కలిసి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రమే చిరంజీవి యొక్క హీరోయిజాన్ని పెంచింది అని కూడా చెప్పవచ్చు. 1992 విడుదలైన ఘరానా మొగుడు ఆ రోజుల్లో పది కోట్ల రూపాయలు వసూలు చేసి తొలి తెలుగు చిత్రంగా రికార్డులు బద్దలు చేసింది. మళ్లీ ఆ రికార్డులు దాటడానికి తెలుగు ఇండస్ట్రీలో చాలా ఏళ్లు పట్టిందని చెప్పవచ్చు.

also read;

మ‌హేష్ చెప్పిన డైలాగ్ బ‌న్నిపై సెటైర్‌.. సోష‌ల్ మీడియాలో హాట్ టాఫిక్..!

ప్రైవేట్ వీడియోలు బ‌య‌ట‌పెడ‌తాన‌న‌డంతో.. ప్రియుడిని మ‌ట్టుపెట్టించిన ప్రియురాలు..!

 

Visitors Are Also Reading