యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాజా వారు రాణిగారు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఇదే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది రహస్య గోరఖ్ . ఈ సినిమా హీరో హీరోయిన్ గా వీరికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే రాజా వారు రాణిగారు షూటింగ్ సమయంలో కిరణ్, రహస్యాల మధ్య మొదలైన స్నేహం తర్వాత ప్రేమగా మారిందని టాక్ వినిపించింది. సోషల్ మీడియాలో వీరిని లవ్ బర్డ్స్ గా పేర్కొంటూ ఎన్నో వార్తలు వచ్చిన వివిధ మాత్రం అస్సలు పట్టించుకోలేదు.
Advertisement
ఆ మధ్య కిరణ్ అక్కడ వెకేషన్ కి వెళ్లగా అక్కడ దిగిన ఫోటోలు షేర్ చేశాడు. అటు రహస్య కూడా అదే లొకేషన్ లో దిగిన ఫోటో షేర్ చేయడంతో వీరిద్దరూ కలిసే షికారుకు వెళ్లారని తేలిపోయింది. ఇక ఆ తరువాత కిరణ్ గృహ ప్రవేశ వేడుకలోనూ సందడి చేయడంతో వీరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. తాజాగా మరోసారి దొరికిపోయాడు కిరణ్ అబ్బవరం.
Advertisement
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దావత్ అనే కొత్త షో ను ప్రారంభించింది. ఈ షోలోకి కిరణ్ ఫస్ట్ గెస్ట్ గా విచ్చేశాడు. ఇక వచ్చి రావడంతోనే తన లవ్ లైఫ్ గురించి అడిగేసింది హోస్ట్ అష్ రెడ్డి. రహస్య గోరఖ్ మీరు రిలేషన్ లో ఉన్నారా అని అడగడంతో అలాంటివి ఏమైనా ఉంటే మీకు తప్పకుండా చెబుతానని సమాధానం చెప్పింది. మీరిద్దరూ కలిసి ఒకేసారి పెళ్లి డేట్ ఎప్పుడో చెబుతారని ఆట పట్టించింది ఆషు. దీంతో సిగ్గు పడిపోయిన కిరణ్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎప్పుడు ఇంతలా దొరికి పోలేదా అని చెప్పుకొచ్చాడు. దొరికిపోయాను అంటున్నాడు అంటే నిజంగానే వీరిద్దరూ లవ్ లో ఉన్నట్టేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.